-->

Bethlehem puramuna chithrambu kalige బేత్లేహేం పురమున చిత్రంబు కలిగె

బేత్లేహేం పురమున చిత్రంబు కలిగె
కర్తాది యేసు జన్మించినపుడు
అంధకారంపు పృథివి వీధులలో
మోదంపు మహిమ చోద్యంబుగానరే
1. ఉదయంపు తారల్ ముదమున బాడే
ఉదయించ యేసు ఈ పృథివిలోన
ముదమును గలిగె మరి సమాధానం
పదిలంబుతోడ పూజించ రండి            ||బేత్లేహేం||
2. పరమును విడచి నరరూపమెత్తి
అరుదెంచి యేసు పరమ వైద్యుండై
నరుల దుఃఖములన్ తొలగించివేసి
పరలోక శాంతి స్థిరపరచె ప్రభువు         ||బేత్లేహేం||
3. నీదు చిత్తమును నాదు హృదయమున
ముదమున జేయ మదినెంతో యాశ
నీదు పాలనము పరమందు వలెనె
ఈ ధరణియందు జరుగంగ జూడ       ||బేత్లేహేం||
4. దేవుని సన్నిధి దీనత నుండ
పావనయాత్మ పవిత్ర పరచున్
పావనుడేసు ప్రకాశమిచ్చి
జీవంబు నొసగి జీవించు నెదలో       ||బేత్లేహేం||
5. గతించె రాత్రి ప్రకాశించె కాంతి
వితానముగ వికసించె నెల్ల
దూతల ధ్వనితో పతి యేసు క్రీస్తు
అతి ప్రేమతోడ అరుదెంచె నోహో     ||బేత్లేహేం||
Share:

No comments:

Post a Comment

Facebook

lent

Good friday

Powered by Blogger.


123

1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నదరంబయో కన్న ...

Search This Blog

3/related/default

Text Widget

Contributors

Categories

Pages

No Thumbnail

No Thumbnail
50

Most Recent

Subscribe Us

Comments

Technology

Latest Posts

Recent Posts