Song no: 111
ఱేఁడు మెస్సీయ జన్మించెను శ్రీదా వీదు పురమున
నుద్భువించెను
వేడుకతోడను బాడుఁడి పాటలు రూఢిగ సాతాను కాడిని
దొలఁగింప ||ఱేఁడు||
1. మనకొఱకై శిశువు పుట్టెను అతఁడు మన దోషములను బోగొట్టెను
1. మనకొఱకై శిశువు పుట్టెను అతఁడు మన దోషములను బోగొట్టెను
అనయంబు నతనిమీఁ దను రాజ్యపు భార ము నుంచఁబడె విమో
చనకర్త యితఁ డౌను ||ఱేఁడు||
2. పరలోక సైన్యంబు గూడెను మన వర శిశువును గూర్చి పాడెను
2. పరలోక సైన్యంబు గూడెను మన వర శిశువును గూర్చి పాడెను
నరులయందున గరుణ ధర సమాధానంబు చిర దేవునికి బహు
మహిమ యటంచును ||ఱేఁడు||
3. కొమ్మ యెష్షయినుండి పుట్టెను చిగురు క్రమ్మర మొద్దున బుట్టెను
3. కొమ్మ యెష్షయినుండి పుట్టెను చిగురు క్రమ్మర మొద్దున బుట్టెను
కమ్మొను దేవుని యా త్మమ్మును తెలివి జ్ఞా న
మ్మలోచన మహ త్వ మ్మొక్కుమ్మడినాతని ||ఱేఁడు||
4. సర్వశక్తి గల దేవుఁడు మరియు నుర్వియందు దయాస్వభావుఁడు
4. సర్వశక్తి గల దేవుఁడు మరియు నుర్వియందు దయాస్వభావుఁడు
సర్వమహిమము గల్గు స్వర్గ లోకము వదలి గర్వముతో
నిండిన సర్వంసహా స్థలిపై ||ఱేఁడు||
5. వింతైన వాఁడుగ నుండెను కోరినంత సుందరత లేకుండెను
5. వింతైన వాఁడుగ నుండెను కోరినంత సుందరత లేకుండెను
చింతతోడను మాయా సంగతులగు వారి యంతములేనట్టి
యాపదను వీక్షించి ||ఱే ఁడు||
6. చెదరిన గొఱ్ఱెల వెదకును వాని ముదమున మందలోఁ జేర్చును
6. చెదరిన గొఱ్ఱెల వెదకును వాని ముదమున మందలోఁ జేర్చును
సదయత యేసుండు జనితైక సుతుఁడు భా స్వదధిక
విభుఁడాలో చన కర్త జన్మించె ||ఱేఁడు||
7. అక్షయుండగు యేసు వచ్చెను మన రక్షణమ్మును సిద్ధపర్చెను
7. అక్షయుండగు యేసు వచ్చెను మన రక్షణమ్మును సిద్ధపర్చెను
మోక్షము సరుణా క టాక్షమ్ముతో నియ్య నీక్షితియందున
హెబ్రీ వంశమునందు ||ఱేఁడు||