Home S. P. Balasubrahmanyam Devuni varasulam prema nivasulamu దేవుని వారసులం ప్రేమ నివాసులము Devuni varasulam prema nivasulamu దేవుని వారసులం ప్రేమ నివాసులము personly November 06, 2017 0 share Song no: 658 దేవుని వారసులం – ప్రేమ నివాసులము జీవన యాత్రికులం – యేసుని దాసులము నవ యుగ సైనికులం – పరలోక పౌరులము హల్లెలూయ – నవ యుగ సైనికులం – పరలోక పౌరులము || దేవుని || సజీవ సిలువ ప్రభు – సమాధి గెలుచుటకే విజేత ప్రేమికులం – విధేయ బోధకులం నిజముగ రక్షణ ప్రబలుటకై ధ్వజముగ సిలువను నిలుపుదుము (2) || దేవుని || ప్రభువును చూచుటకై ప్రజలందరు రాగా విభు మహిమను గాంచ – విశ్వమే మేము గోల శుభములు గూర్చుచు మాలోన శోభిల్లు యేసుని చూపుదుము (2) || దేవుని || దారుణ హింస లలో – దేవుని దూతలుగా ఆరని జ్వాలలలో – ఆగని జయములతో మారని ప్రేమ సమర్పణతో సర్వత్ర యేసుని కీర్తింతుము (2) || దేవుని || పరిశుద్దాత్మునికై – ప్రార్థన సలుపుదము పరమాత్ముని రాక – బలము ప్రసాదింప ధరణిలో ప్రభువును జూపుటకై సర్వాంగ హోమము జేయుదము (2) || దేవుని || అనుదిన కూటములు – అందరి గృహములలో ఆనందముతోను – ఆరాధనలాయే వీనుల విందగు పాటలతో ధ్యానము చేయుచు మురియుదము (2) || దేవుని || హత సాక్షుల కాలం – అవనిలో చెలరేగ గతకాలపు సేవ – గొల్గొతా గిరి జేర భీతులలో బహు రీతులలో నూతన లోకము కాంక్షింతుము (2) || దేవుని || Song no: 658 Devuni Vaarasulam – Prema Nivaasulamu Jeevana Yaathrikulam – yesuni Daasulamu Nava Yuga Sainikulam – Paraloka Pourulamu Hallelooya – Nava Yuga Sainikulam – Paraloka Pourulamu || Devuni || Sajeeva Siluva Prabhu – Samaadhi Geluchutake Vijetha Premikulam – Vidheya Bodhakulam Nijamuga Rakshana Prabalutakai Dhwajamuga Siluvanu Nilupudumu (2) || Devuni || Prabhuvunu Choochutakai Prajalandaru Raagaa Vibhu Mahimanu Gaancha – Vishwame Mamu Gola Shubhamulu Goorchuchu Maalona Shobhillu Yesuni Choopudumu (2) || Devuni || Daaruna Himsalalo – Devuni Doothalugaa Aarani Jwaalalalo – Aagani Jayamulatho Maarani Prema Samarpanatho Sarvathra Yesuni Keertinthumu (2) || Devuni || Parishuddhaathmunikai – Praarthana Salupudamu Paramaathmuni Raaka – Balamu Prasaadimpa Dharanilo Prabhuvunu Jooputakai Sarvaanga Homamu Jeyudamu (2) || Devuni || Anudina Kootamulu – Andari Gruhamulalo Aanandamuthonu – Aaraadhanalaaye Veenula Vindagu Paatalatho Dhyaanamu Cheyuchu Muriyudamu (2) || Devuni || Hatha Saakshula Kaalam – Avanilo Chelarega Gathakaalapu Seva – Golgotha Giri Jera Bheethulalo Bahu Reethulalo Noothana Lokamu Kaankshinthumu (2) || Devuni || Tags A.B. MasilamaniAndhra Kraisthava KeerthanaluOld Christian SongsS. P. Balasubrahmanyam Facebook Twitter Whatsapp Newer Older