-->

Balavanthuni chethikindha Lyrics


బలవంతుని చేతిక్రింద దీనమనసుతో
తలవంచుము హెచ్చించును నిన్ను ఘనతతో
పెద్దవాడు కాలేవు సొంతతెలివితో
పక్కవాని పడగొట్టే దుష్టబుద్ధితో
అ.ప: మేలుపొంది మరచిపోకు గోప్పనేరము
తిరిగుబాటువాళ్ళ వచ్చే శిక్ష ఘోరము
1 పెంచి గొప్పచేసిన ప్రియమైన పిల్లలు
తనను విడిచిపోయిన తండ్రికెంత వేదన
చెరకు చేయువారికి శ్రమ రాకపోవునా
విశ్వసఘాతుకం కీడు తేక మానునా
2 దేవుడు నియమించిన మోషే ఆహారోనుకు
ఎదురుగా లేచిన విరోధముగ కూడిన
దుష్టజనుల మీదికి అగ్ని రాకఆగెనా
భూమి చీలి వారిని మింగకుండ మానెనా
3 సొంతఇల్లు తెలియని యజమానుని కానని
దోషభరితజనులకు లేకపోయె యోచన
నాశనమే కలుగును మాట వినకపోయినా
వివాదమే తొలుగును తిరిగి ప్రభుని చేరిన


Share:

No comments:

Post a Comment

Facebook

lent

Good friday

Powered by Blogger.


123

1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నదరంబయో కన్న ...

Search This Blog

3/related/default

Text Widget

Contributors

Categories

Pages

No Thumbnail

No Thumbnail
50

Most Recent

Subscribe Us

Comments

Technology

Latest Posts

Recent Posts