Thrahimam kreesthu nadha త్రాహీ మాం క్రీస్తు నాధ దయ చూడ రావే

ly
0
Pilli
Kamalakar
M. D. Shikha Mani
Nithya Santhoshini
Bilmoria
Song no: 313

త్రాహి మాం క్రీస్తు నాధ దయఁ జూడ రావే నేను దేహి యనుచు నీ పాదములే దిక్కుగాఁ జేరితి నిపుడు ||త్రాహి||

గవ్వ చేయురాని చెడ్డ కర్మేంద్రియాధీనుఁడనై రవ్వ పాలై నే నెంతో నెవ్వఁ బొందితిఁ త్రవ్వుచున్న కొలఁదిఁ పెరుఁగుఁ దరగదు నా పాప రాశి యివ్విధమునఁ జెడిపోతినినే నేమి సేతు నోహోహోహో ||త్రాహి||

నీ యందు భయభక్తులు లేని నిర్లజ్జాచిత్తముఁ బూని చేయరాని దుష్కర్మములు చేసినాఁడను దయ్యాలరాజు చేతిలోఁ జేయి వేసి వాని పనులఁ జేయ సాగి నే నిబ్భంగిఁ జెడిపోయితి నే నయ్యయ్యయ్యొ ||త్రాహి||

నిబ్బర మొక్కించుకై నిజము రవ్వంతైన లేక దబ్బర లాడుటకు ము త్తా నైతిని అబ్బురమైన ఘోర పా పాంధకార కూపమందు దబ్బున బడిపోతి నయ్యో దారి చెడి నేనబ్బబ్బబ్బా ||త్రాహి||

నిన్నుఁ జేరి సాటిలేని నిత్యానంద మందఁబోవు చున్నప్పుడు నిందలు నా కెన్ని చేరినా విన్నదనము లేకుండ నీ వే నా మదికి ధైర్యమిచ్చి యన్నిట రక్షించి తివి నా యన్న నీకు స్తోత్ర మహాహా ||త్రాహి||





Post a Comment

0Comments

Post a Comment (0)