Song no: 167
- అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి
- యేసయ్య నా హృదయ సీమను ఏలుమయ
నీ దివ్య సన్నిది చాలునయ || అనురాగాలు ||
- నీ జ్ఞాన ఆత్మయే వికసింపచేసెను నన్ను
సర్వ సత్యములలో నే నడచుటకు
మరపురాని మనుజాశాలను విడిచి
మనసార కొనియాడి జీవించెద ఇక నీ కోసమే || అనురాగాలు ||
- అపురూప దర్శనమే బలపరుచుచున్నది నన్ను
వెనుదిరిగి చూడక పోరాడుటకు
ఆశ్చర్యకరమైన నీ కృప పొంది
కడవరకు నీ కాడినే మోయుట నా తుది నిర్ణయమే || అనురాగాలు ||
- నీ నీతి నియమములే నడిపించుచున్నది నన్ను
స్వర్ణ కాంతిమయమైన నగరము కొరకు } 2
అమూల్యమైన విశ్వాసము పొంది
అనుక్షణము నిన్ను తలచి హర్షించేనే నాలో నా ప్రాణమే || అనురాగాలు ||
అరుదైన రాగాలనే స్వరపరచి
ఆనందగానలే సప్త స్వరాలుగా నే పాడనా