Song no: #126 225
- ఓ సద్భక్తులార లోక రక్షకుండు
బెత్లెహేమందు నేడు జన్మించెన్
రాజాధిరాజు ప్రభువైన యేసు
నమస్కరింప రండి నమస్కరింప రండి
నమస్కరింప రండి ఉత్సాహముతో
- సర్వేశ్వరుండు నరరూపమెత్తి
కన్యకు బుట్టి నేడు వేంచెసెన్
మానవ జన్మ మెత్తిన శ్రీ యేసూ
నీకు సమస్కరించి నీకు సమస్కరించి
నీకు సమస్కరించి పూజింతుము
- ఓ దూతలార ఉత్సహించి పాడి
రక్షకుండైన్ యేసున్ స్తుతించుడి
పరాత్పరుండ నీకు స్తోత్రమంచు
నమస్కరింప రండి నమస్కరింప రండి
నమస్కరింప రండి ఉత్సాహముతో
- యేసూ! ధ్యానించీ నీ పవిత్రజన్మ
మీ వేలస్తోత్రము నర్పింతుము
అనాది వాక్య మాయె నరరూపు
నమస్కరింప రండి నమస్కరింప రండి
నమస్కరింప రండి ఉత్సాహముతో