Yevaraina unnara yechataina ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా

Song no: 250
    ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా
    ఈలాటి స్నేహితుడు
    నా యేసయ్యలాంటి మంచి స్నేహితుడు
    ప్రేమించి ప్రాణంబెట్టిన గొప్ప స్నేహితుడు

  1. హేతువేమి లేకుండా లాభమేమి పొందకుండా
    ప్రేమ చూపువారు లేరు లోకమందునా
    నేను కోరుకోకుండా నాకోసము
    తనకు తాను చేసినాడు సిలువయాగము

  2. అంతస్థులు లేకుండా అర్హతలు చూడకుండా
    జతను కోరువారు దొరకరు ఎంత వెదకినా
    నీచుడనని చూడకుండా నాకోసము
    మహిమనంతా వీడినాడు ఏమి చిత్రము

  3. స్వార్ధమేమి లేకుండా ఫలితం ఆశించకుండా
    మేలు చేయువారు ఎవరు విశ్వమందునా
    ఏమి దాచుకోకుండా నాకోసము
    ఉన్నదంతా ఇచ్చినాడు ఏమి త్యాగము
Share:

No comments:

Post a Comment

Popular Products

Labels

Blog Archive

Recent Posts

Unordered List

  • Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit.
  • Aliquam tincidunt mauris eu risus.
  • Vestibulum auctor dapibus neque.

Pages