Manaserigina yesayya madhilona jathaga nilichavu మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు

ly
0
Song no: 115

    మనసెరిగిన యేసయ్యా
    మదిలోన జతగా నిలిచావు }2
    హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసి
    నీ పత్రికనుగా మార్చావు } 2 || మనసెరిగిన ||

  1. నిర్జీవ క్రియలను విడిచి పరిపూర్ణ పరిశుధ్ధతకై
    సాగిపోదును నేను ఆగిపోలేనుగా } 2
    సాహసక్రియలు చేయు నీ హస్తముతో
    నన్ను పట్టుకొంటివే విడువలేవు ఎన్నడు } 2 || మనసెరిగిన ||

  2. వెనకున్న వాటిని మరచి నీతోడు నేను కోరి
    ఆత్మీయ యాత్రలొ నేను సొమ్మసిల్లి పోనుగా } 2
    ఆశ్ఛర్యక్రియలు చేయు దక్షిణ హస్తముతో
    నన్ను ఆదుకొంటివే ఎడబాయవు ఎన్నడు } 2 || మనసెరిగిన ||

  3. మర్త్యమైన దేహము వదిలి అమర్త్యతను పొందుటకై
    ప్రభు బల్లారాధనకు దూరము కాలేనుగా } 2
    నేలమంటితో నన్ను రూపించిన హస్తములే
    నన్ను కౌగలించెనే వదలలేవు ఎన్నడు } 2 || మనసెరిగిన ||

Post a Comment

0Comments

Post a Comment (0)