50
Chuchu chunnamu nee vaipu చూచుచున్నాము నీవైపు మా ప్రియ జనక
11
రాగం -
(చాయ: )
తాళం -
చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీవైపు చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను జాఁచుచుఁ గరములు చక్కఁగా నీవైపు
||చూచు||
మేమరులమై యుంటిమి మార్గము వీడి మేమందరము పోతిమి ప్రేమచే నప్పుడు ప్రియ తనయ నంపించి క్షేమమార్గము మాకుఁ బ్రేమను జూపితివి
||చూచు||
నిను నమ్ము పాపులకు వారెవరైన నీ శరణుఁ జొచ్చువారలకు ఇనుఁడవు కేడెంబు నీ జగతిలో నగుచుఁ గనుపరచుచుందువు ఘన మైన నీ కృపఁ
||చూచు||
నీ భయము మాయెదలను నిలుపుము నీదు ప్రాభవ మొనరంగను నీ భయముచే మేము వైభవ మొందుచు నే భయము లేకుండ నీ భువిని గొన్నాళ్ళు
||చూచు||
దయఁజూచి మము నెప్పుడు మంచివి యన్ని దయచేయు మెల్లప్పుడు దయచేయరానివి దయచేయుమని కోరఁ దయజూపి మన్నించు దయగల మా తండ్రి
||చూచు||
update
|| Update ||
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment