-->

Papini nenani prabhupadhamulakada పాపినినేనని ప్రభుపదములకడ ప్రార్థన సేయుము

Song no: 306
    పాపినినేనని ప్రభుపదములకడ ప్రార్థన సేయుము ఓ మనసా
    పాపుల మిత్రుడు ప్రభు యేసునికడ పాపక్షమాపణ కలదో మనసా ||పాపిని||

  1. నరుని స్వనీతిచే దొరుకదు మోక్షము నరులను జూడకు యో మనసా
    ధరనొక పుణ్యుడు దరచినలేడని పరమవేదములో గలదో మనసా ||పాపిని||

  2. జపతపములు మరి యుపవాసములును ఉపయోగింపవు ఓ మనసా
    నెపములు జెప్పెడు అపవాదిని విడి కృపావాదినిగాని బ్రతుకో ఓ మనసా ||పాపిని||

  3. మానని ప్రేమచే మనుజుల బ్రోవగ మానవుడయ్యెను ఓ మనసా
    మానుగ గల్వరి మ్రానిపై యేసుడు ప్రాణము నొసగెను ఓ మనసా ||పాపిని||

  4. మరణము నొందియు మరల సజీవుడై మనుజుల కగుపడెనో మనసా
    మరణ బంధముల బరిమర్పిన ప్రభు సరిరక్షకు లిక లేరిల మనసా ||పాపిని||

  5. మార్పును బొందక మలిన తరుణము మరల లభింపదు మనసా
    తీర్పుకాలమున తీర్పరి క్రీస్తని తిరముగ నమ్ముము యేసుని మనసా ||పాపిని||
Share:

Related Posts:

No comments:

Post a Comment

Facebook

lent

Good friday

Powered by Blogger.


123

1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నదరంబయో కన్న ...

Search This Blog

3/related/default

Text Widget

Contributors

Categories

Pages

No Thumbnail

No Thumbnail
50

Most Recent

Recent Posts