అల్పమైనవాడవని ఏమాత్రం భయపడకు
నిరాశకు తావీయకు
పురుగునైనా మ్రానులాగా మార్చగలడు - నా యేసయ్యా
నిరాశకు తావీయకు
పురుగునైనా మ్రానులాగా మార్చగలడు - నా యేసయ్యా
1. ఓడిపోయియున్న నిను చూస్తాడు యేసు
వాడి రాలుచున్న సరిచేస్తాడు
కార్యం నీ ద్వారా జరిగిస్తాడు
శ్రేష్టమగు దీవెనగా మార్చగలడు నా యేసయ్యా
వాడి రాలుచున్న సరిచేస్తాడు
కార్యం నీ ద్వారా జరిగిస్తాడు
శ్రేష్టమగు దీవెనగా మార్చగలడు నా యేసయ్యా
2. పగిలిపోయియున్న నిను చూస్తాను యేసు
చితికి బ్రతుకుతున్నా సరిచేస్తాడు యేసు
స్తుతులు నీ ద్వారా పలికిస్తాడు యేసు
యోగ్యమగు పాత్రనుగా మార్చగలడు నా యేసయ్యా
చితికి బ్రతుకుతున్నా సరిచేస్తాడు యేసు
స్తుతులు నీ ద్వారా పలికిస్తాడు యేసు
యోగ్యమగు పాత్రనుగా మార్చగలడు నా యేసయ్యా
3.శ్రమతో నలిగియున్న నిను చూస్తాడు యేసు
భ్రమలో బ్రతుకుతున్నా సరిచేస్తాడు యేసు
ధరణి నీ ద్వారా వెలిగిస్తాడు యేసు
దివ్యమగు రూపముగా మార్చగలడు నా యేసయ్యా
భ్రమలో బ్రతుకుతున్నా సరిచేస్తాడు యేసు
ధరణి నీ ద్వారా వెలిగిస్తాడు యేసు
దివ్యమగు రూపముగా మార్చగలడు నా యేసయ్యా







No comments:
Post a Comment