Song no: 86
HD
- సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో
- నేరం చేయని నీవు ఈ ఘోరపాపి కొరకు
భారమైన సిలువ మోయలేక మోసావు (2)
కొరడాలు చెళ్ళిని చీల్చెనే నీ సుందర దేహమునే
తడిపెను నీ తనువును రుధిరంపు ధారలు
- వధకు సిద్దమైన గొర్రెపిల్ల వోలె
మోమున ఉమ్మివేయ మౌనివైనావే (2)
దూషించి అపహసించి హింసించిరా నిన్ను
ఊహకు అందదు నీ త్యాగ యేసయ్యా
- నాదు పాపమె నిన్ను సిలువకు గురిచేసెన్
నాదు దోషమె నిన్ను అణువణువున హింసించెన్
నీవు కార్చిన రక్తధారలే నా రక్షణాధారం
సిలువను చేరెదన్ విరిగిన హృదయముతోను
తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా } 2
వెలియైన యేసయ్యా బలియైన యేసయ్యా
నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా } 2