Akari skhanamokati nee brathukulo agunu ఆఖరి క్షణమొకటి నీబ్రతుకులో ఆగును


ఆఖరి క్షణమొకటి నీబ్రతుకులో ఆగును నీకొరకు ఏదినమో
ఆఖరి శ్వాసొకటి ఈ యాత్రలో – ఆగును ఒకక్షణము ఏ గడియో
ఇది చెప్పలేనిది- చెప్పిరానిది (4)

1)ఒంటరిగా వచ్చావు- అందరితో బ్రతికావు
 నిన్ను కన్నవారే నీకు- ప్రాణదాతలన్నావు (2)
 తల్లిదండ్రులు ఇద్దరు కనినా- (నిను) ఆపలేరు ఆ క్షణము(2)
అ.ప: గుండెచప్పుడు ఆగకముందే తెలుసుకో నిజాన్ని
        ఆఖరిగడియే రాకముందే తెలుసుకో సత్యాన్ని(2) (ఆఖరి)

2)అన్నదమ్ములు అందరూ నీకు- అండదండలన్నావు
 తోడబుట్టినవారే నీకు – తోడునీడ అన్నావు (2)
అభిమానులే ఎందరు ఉన్నా- (నిను) ఆపలేరు ఆ క్షణము(2) (గుండెచప్పుడు)

3)  కట్టుకొన్నవారితో నీవు – కలిసి విడువనన్నావు
నీవు కన్నవారే నీకు- కంటిపాపలన్నావు (2)
నీవారే ఎందరు ఉన్నా- (నిను) ఆపలేరు ఆ క్షణము (2) (గుండెచప్పుడు)

4)  ఆత్మవైన నీవు- విడవాలి మట్టి దేహమును
ఆత్మయైన ఆ దేవుడు – చేసాడు నీకు ఆ పరమును (2)
చేరాలి నీవు ఆ లోకము- ప్రభుయేసే దానికి మార్గము (2) (గుండెచప్పుడు)


Share:

No comments:

Post a Comment

Popular Products

Labels

Blog Archive

Recent Posts

Unordered List

  • Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit.
  • Aliquam tincidunt mauris eu risus.
  • Vestibulum auctor dapibus neque.

Pages