Manchi devudu yesu devudu మంచి దేవుడు యేసు దేవుడు


Song no:


పII మంచి దేవుడు యేసు దేవుడు – నా ప్రాణ స్నేహితుడు...
ప్రేమించెనుప్రాణమిచ్చెను – ఈ స్థితికి నన్ను చేర్చెను...II2II
నాపేద బ్రతుకును మార్చినాడు – నన్నెంతో దీవించెనుII2II
లోకానదొరకని తన శ్రేష్ట ప్రేమ – నా యెడల కనుపరచినాడుIIమంచిII

1.నా బాధలన్ని తొలగించినాడు – నా భారమేమోసినాడు
నాదుఃఖ దినములు సరిచేసినాడు – సంతోషమే ఇచ్చినాడు
తనకౌగిట చేర్చుకొని నా కన్నీటినే తుడిచినాడు..
నీతల్లి మరిచినా... నే నిన్ను మరువను అని ఆభయమే ఇచ్చినాడు IIమంచిII

2.నా దీన స్థితిని గమనించినాడు – నా గాదనేమార్చినాడు
నేపడిన స్థితిని గుర్తించినాడు – తన చేతితో లేపినాడు
నాగాయములన్ని కడిగి-నన్నెంతో ప్రేమించినాడు
తనప్రేమ చాటే ఓ గాయకునిగా తన స్వరమునే ఇచ్చినాడుIIమంచిII

3.నా పాప శిక్షను భరియించినాడు-నా పక్షమేనిలిచినాడు
నాకొరతలన్ని తను తీర్చినాడు-నా నింద తొలగించినాడు
నీనడిగిన అన్నివేళలా – నా మనవి మన్నించినాడు
నేవెళ్ళు దారిలో – నా తోడు నడిచి – నన్నెంతో బలపరిచినాడుIIమంచిII

Share:

No comments:

Post a Comment

Popular Products

Labels

Blog Archive

Recent Posts

Unordered List

  • Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit.
  • Aliquam tincidunt mauris eu risus.
  • Vestibulum auctor dapibus neque.

Pages