Rende rendu dharulu ye dhari kavalo manava రెండే రెండు దారులు ఏ దారి కావాలో మానవా


Song no:

 రెండే రెండు దారులు ఏ దారి కావాలో మానవా "2"
    ఒకటి పరలోకం మరియొకటి పాతాళం

    1. పరలోకం గొప్ప వెలుగుతో ఉన్నది పరిశుద్ధులకోసం
    రాత్రి ఉండదు పగలు ఉండదు – సూర్యుడుండడు చంద్రుడుండడు
    దేవుడైన ప్రభువే ప్రకాశించుచుండెను –
    యుగయుగములు పరలోక  రాజ్యమేలుచుండెను –
    యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుకో ||రెండే||

    2. పాతాళం అగ్నిగుండము ఉన్నది ఘోర పాపుల కోసం
    అగ్ని ఆగదు పురుగు చావదు –
    అగ్నిలోన ధనవంతుడు బాధపడుచుండెను
    అబ్రాహాము రొమ్మున లాజరును చూశాడు –
    లాజరును చూసి దాహమని అడిగాడు –
    యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుకో ||రెండే||

    3. పుడతావు నీవు దిగంబరిగ వెళతావు నీవు దిగంబరిగ
    గాలి మేడలు ఎన్నో కడతావు – నాకంటే ఎవ్వరు ఉన్నారంటావు
    లోకంలో ఘోరమైన పాపాలు చేస్తావు – ఆ పాపాలే నిన్ను అగ్నిపాలు చేస్తాయి
   అగ్నిలోన పడకుండా యేసు ప్రభుని నమ్ముకో ||రెండే||


Share:

No comments:

Post a Comment

Popular Products

Labels

Blog Archive

Recent Posts

Unordered List

  • Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit.
  • Aliquam tincidunt mauris eu risus.
  • Vestibulum auctor dapibus neque.

Pages