50
Na kalagathu levvi na chethulanu levu నా కాలగతు లెవ్వి నా చేతులను లేవు
13
రాగం -
(చాయ: )
తాళం -
నా కాలగతు లెవ్వి నా చేతులను లేవు నాదు దేవ యెపుడు నీకే వాని మీద నిత్యాధికారంబు నిల్చియుండు
||నా||
తల్లిగర్భంబున దసర సృజించితివి ధరణి నన్ను నీవు తల్లికన్నను మిగుల దయచేతఁ జూచితివి తండ్రి నన్ను
||నా||
పాప కూపమునందుఁ బడియుండఁగా నన్నుఁ బారఁజూచి చేయి చాపి యేసునిద్వార చక్కఁగాఁదెచ్చితివి చాలు దేవా
||నా||
సుఖఃదుఖ కాలములు శోధింపఁ బంపుదువు శోభాయుక్త నాకు సుఖముఁ గల్గజేయు సొంపుగ వానిచే స్థూల శక్తి
||నా||
సకల కాలంబులఁ జక్కఁగ లోఁబడి నన్నుతింతు నన్ను ఆకలంకునిగాఁ జేయు మనుచు వేఁడుచునుందు నధికాసక్తి
||నా||
update
|| Update ||
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment