Home Sai Sivani Yetula neeku stuthu lonarthumu yehova thanaya ఎటుల నీకు స్తుతు లొనర్తుము యెహోవ తనయ Yetula neeku stuthu lonarthumu yehova thanaya ఎటుల నీకు స్తుతు లొనర్తుము యెహోవ తనయ personly January 12, 2019 0 share 23 రాగం - (చాయ: ) తాళం - ఎటుల నీకు స్తుతు లొనర్తుము యెహోవ తనయ యెటుల నీకుఁ నుతు లొనర్తుము పటుతర పాపంబులనెడి పంకమందుఁజిక్కి మదిని దిటముఁ జెడిన మమ్ముఁ బ్రోచి దిక్కుఁజూపినట్టి యేసూ ||యెటుల||పాపకూపమందు నుండగాఁ బాపావిమోచ దాపుఁజేర్చి కాపుఁ జూపితి శాపగ్రస్తులైన మా శాపము విముక్తిఁజేయ నీ పవిత్ర రక్తమే నా ప్రాపుగా నొసంగితివి ||యెటుల||భార భరితమైన యాత్మల భారమున దీసి భూరి సౌఖ్యములతో నింపను భారకుండ ఘోరమైన శ్రమలనొంది మరణమొంది తిరిగిలేచి నీవు ధాత్రి మహిమ నొందినట్టి దేవా ||యెటుల||నీతిహీనులమై యుండఁగా నో కర్త మాదు బీతులన్నిఁబాపి నీ కృపన్ నీతి రక్షణవస్త్రములను భాతిగ ధరింపజేసి భూతలంబునందు నిన్ను ఖ్యాతిగ సేవింపఁజేసితి ||యెటుల||నిన్నుఁజేరి నిర్చలుండనై యీ భూమియందు నిన్నుఁ బోలి నడుచుకొనుటకై తిన్నని మార్గమును జూపి అన్ని కీడులను జయింపఁ బన్నుఁగ విమలాత్మశక్తి నున్నతముఁగ నిడిన యేసూ ||యెటుల||పరమ రాజ్యమందు నిరతము నీతోడనుండఁ కరుణతోడ నెంచుకొంటివి తిరిగి వచ్చి మమ్మును మీ చిరప్రకాశ పురమునందుఁ త్వరగఁ జేర్చియందు సుఖము దిరముగా నొసంగుదేవ ||యెటుల|| update || Update || Tags Andhra Kraisthava Keerthanalu 📖Mamuduri Syman ✍Sai Sivani Facebook Twitter Whatsapp Newer Older