సాటిలేని దైవమా నా యేసయ్యా
మాటతోనే చేతువు ఏ కార్యమైనా (2)
తోడు నీడగా వెంట ఉందువు
అన్ని వేళలా ఆదుకొందువు (2) "సాటిలేని"
బండ నుండి నీటిని - ప్రవహింప జేసావు
ఎండిన యెముకలలో - జీవాన్ని పోసావు (2)
నీవే నాతో ఉండగా - అపజయమే లేనేలేదుగా (2) "తోడు నీడగా"
ఆశగల ప్రాణాన్ని - సంతృప్తి పరచావు
ఆకలిగొను వారిని - మేలుతో నింపావు (2)
నీవే నాతో ఉండగా - అన్యాయము నాకు జరగదుగా (2) "తోడు నీడగా"
నా ఎడారి భూములు - తోటగా మార్చావు
సంగీత గానము - వినిపింపజేసావు (2)
నీవే నాతో ఉండగా - అపశృతులే నాలో లేవుగా (2) "తోడు నీడగా"