Song no: #40
- శుద్ధి, శుద్ధి, శుద్ధి! సర్వశక్త ప్రభు ప్రాతఃకాలస్తుతి నీకీ చెల్లింతుము శుద్ధి, శుద్ధి, శుద్ధి! కృపగల దేవా! ముగ్గురైయుండు దైవత్ర్యేకుఁడా!
- శుద్ధి, శుద్ధి, శుద్ధి! అని పరమందుఁ బరవాసు లెల్ల నిన్నేశ్లాఘింతురు శెరపుల్ ఖెరూబుల్ సాష్టంగపడి నిత్యుఁడవైన నిన్ నుతింతురు.
- శుద్ధి, శుద్ధి, శుద్ధి! తేజరిల్లు దేవ పాపి కన్ను చూడలేని మేఘ వాసివి అద్వితీయప్రభు, నీవు మాత్రమేను కరుణ, శక్తి, ప్రేమరూపివి.
- శుద్ధి, శుద్ధి, శుద్ధి! సర్వశక్త ప్రభు సృష్టిజాలమంత నీ కీర్తిఁబాడును శుద్ధి, శుద్ధి, శుద్ధి! కృపగల దేవ ముగ్గురైయుండు దైవత్ర్యేకుఁడా!