Song no: #45
- వేఁడెద నాదగు వినతిని గైకొనవే జగదీశ ప్రభో నేఁడు ప్రతిక్షణ మెడబాయక నా తోడ నుండవె ప్రభో ||వేఁడెద||
- ప్రాతస్తవము భవత్సన్నిధి సర్వంబున నగు నాదౌ చేతస్సున ధర్మాత్మను సంస్థితిజేయవె సత్కృపను ||వేఁడెద||
- నేఁ బాతకి నజ్ఞానుఁడఁ ప్రభువా నీవు కరుణజేయు పాపాచరణము నందున జిత్తము బాపుము నాకెపుడు ||వేఁడెద||
- పాపముఁ గని భీతుఁడనై శంకా పరత సతము నుండన్ నా పైనుంచుము నీదగు సత్కరుణా దృష్టిని బ్రేమన్ ||వేఁడెద||
- నాదగు పాప భరం బంతయు నీ మీఁదనె యిడుచుందున్ నీదు మహాకృప నుండి యొసంగుము నిర్మల గతి నాకున్ ||వేఁడెద||
- అవిరత మతి నిటు లతులిత గతి నీ స్తుతి నుతు లొనరింతున్ భవదంఘ్రలపై నాదగు భక్తిని బ్రబలింపవే యేసు ||వేఁడెద||