పాపం బలికొరితే...తన సోదరులందరిననీ...
తానే బలి ఆయెను...ఆత్యాగం ఎందుకనీ
నిన్నువలె నీ పొరుగువాని ప్రేమించు...
యేసు వలె నీ బ్రతుకులోన చూపించు...
తన దేహమునే రొట్టెలు ముక్కలు గావించి.
నీ ఆకలి తీర్చే ఆహారంగా అందించి.
తన రక్తమునే ద్రాక్షారసముగ చిందించి...
నీ దాహం తీర్చే పానీయముగా అర్పించి..
బలైపోయాడు ప్రభువు సిలువలో.
బలికోరుతున్నాడు అదే ప్రభువు నీ బ్రతుకులో.
ఇదే ఇదే ప్రభువు బల్ల పరమార్థం||2||
||పాపం||
దేవుని స్వరూపం ఎందుకునీ...
సమానంగా ఉన్నాగాని..
విడువలేనిదా భాగ్యమని...
ఎంచుకొనక తగ్గించుకొని..ఆ.ఆ.|2|
దాసుని స్వరూపము ధరించుకొని..
తనను తానే రిక్తుని చేసుకొని..
సిలువమరణమునకప్పగించుకొని..
విధేయతను తను కనుపరచుకొని...
ఆకారంలో మనుష్యుడుగా కనిపించాడు.
పానార్పణముగాతానే పోయబడినాడు.
ప్రాణము లక్ష్యము చేయక నీకై నిలిచాడు..
నీ పాపములకు ప్రాయాచిత్తంచేశాడు..
ప్రాణం పెట్టాడు ప్రభువు ప్రేమతో..
ప్రాణం పెట్టబద్ధులు అంటున్నాడు తన వారితో..||ఇదే||
రొట్టె పట్టుకుని విరిచాడు...శిష్యులందరికి ఇచ్చాడు....
ద్రాక్షారసమును పంచాడు....పనిని జ్ఞాపకం చేశాడు....
వివేచనతో తిని తాగమన్నాడు...
సువార్త భారం మోయమన్నాడు...
ప్రాణాన్నే ద్వేషించమన్నాడు ...
తనను పోలి జీవించమన్నాడు..
పాపుల పాదాలే పరిశుద్ధుడు కడిగాడు...
నీ కొరకై తానెంతో తగ్గించుకున్నాడు...
తన రూపాన్నే నీలో చూడాలన్నాడు ..
అందుకే తనను తిని త్రాగమన్నాడు...
లోకమందు ఉన్నదా ఇంతటి ప్రేమా..
ఈ ప్రేమ లేకపోతే ఇది క్రైస్తవ్యమా?...||ఇది||