-->

Lechi sthuthimpa bunudi lokeswaruni లేచి స్తుతింపఁ బూనుఁడి లోకేశ్వరుని

Song no: #47
    లేచి స్తుతింపఁ బూనుఁడి లోకేశ్వరుని లేచి స్తుతింపఁ బూనుఁడి లేచి స్తుతించెదము చూచుచు మనలను బ్రోచి ప్రేమతోఁ గరము జాచి కాపాడు విభుని ||లేచి||

  1. రాత్రి జాముల యందున రంజిలఁదన నేత్రము తెరచినందున మైత్రితో దేవ దయకు పాత్రులమైతిమి శ్రోత్రముల కింపుసఁబ విత్ర గీతము పాడుచు ||లేచి||
  2. నిదురఁభోయిన వేళను నిర్మలమైన హృదయము మనకు నియ్యను ముదముతో నిదురఁబొంది యుదయాన లేచితిమి సదయుఁడైన క్రీస్తు పదముల దరిఁజేర ||లేచి||
  3. నిగమ వేద్యుఁడు మనలనుఁ దనలోన నీ పగలు కాపాడఁబూనెను దిగులు బొందక పనులు తెగువతోఁ జరుపుకొనుచు వగపుతో లేచి మ్రొక్కి మిగుల శుద్ధాత్మనడిగి ||లేచి||
  4. నేటి పాఠములయందు నిర్భయముగ దాటివెలసి యుందు సూటిగ నీదు ఱెక్కల చాటుగను నిలుపు మనుచు నీటుగా నెల్లవార నిత్యము ప్రేమనేల ||లేచి||
Share:

Related Posts:

No comments:

Post a Comment

Facebook

lent

Good friday

Powered by Blogger.


123

1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నదరంబయో కన్న ...

Search This Blog

3/related/default

Text Widget

Contributors

Categories

Pages

No Thumbnail

No Thumbnail
50

Most Recent

Recent Posts