Song no: 51
- నూతన యెరుషలేమ్ - దిగి వచ్చుచున్నది
- శోభ కలిగిన - ఆ దివ్య నగరము
వర్ణింప శక్యము - కానిదియే -2
బహు సహస్రముల - సూర్యుని కంటె -2
ప్రజ్వలించుచున్నది - మహిమవలెను
నూతన యెరుషలేమ్ - దిగి వచ్చుచున్నది
పెండ్లికుమార్తె వలె - మహిమతో నిండి
- పరిపూర్ణమైన -సౌందర్యమును .
పృథ్వికి - ఆనందముగాను -2
భూరాజులందరు - మహిమ తెచ్చెడి -2
మహిమగల నగరము – ఇదియే
నూతన యెరుషలేమ్ - దిగి వచ్చుచున్నది
పెండ్లికుమార్తె వలె - మహిమతో నిండి
- ధగధగ మెరయు - సూర్యకాంతం వలె
జ్వలించుచున్న- దైవనగరమందు -2
నీతిమంతులే - సూర్యునివలెను -2
నిత్య నిత్యముగా - ప్రకాశించుచుందురు
నూతన యెరుషలేమ్ - దిగి వచ్చుచున్నది
పెండ్లికుమార్తె వలె - మహిమతో నిండి
పెండ్లికుమార్తె వలె - మహిమతో నిండి
స్వర్గమునందున్న- దేవుని యొద్దనుండి
నూతన యెరుషలేమ్ - దిగి వచ్చుచున్నది
పెండ్లికుమార్తె వలె - మహిమతో నిండి