Song no: #47
లేచి స్తుతింపఁ బూనుఁడి లోకేశ్వరుని లేచి స్తుతింపఁ బూనుఁడి లేచి స్తుతించెదము చూచుచు మనలను బ్రోచి ప్రేమతోఁ గరము జాచి కాపాడు విభుని ||లేచి||
రాత్రి జాముల యందున రంజిలఁదన నేత్రము తెరచినందున మైత్రితో దేవ దయకు పాత్రులమైతిమి శ్రోత్రముల కింపుసఁబ విత్ర గీతము పాడుచు ||లేచి||
నిదురఁభోయిన వేళను నిర్మలమైన హృదయము మనకు నియ్యను ముదముతో నిదురఁబొంది...
Sthothramu sthothramu o deva ie vekuvane sthothramu స్తోత్రము స్తోత్రము ఓ దేవా ఈ వేకువనే
Song no: #48
స్తోత్రము స్తోత్రము ఓ దేవా ఈ వేకువనే స్తోత్రము జేతుము మా దేవా రాత్రియందున మమ్ము రక్షించి గాపాడి ధాత్రి మరియొక దినమున్ దయతో నిచ్చెన దేవా||
పాపశోధనలనుండి ప్రభువా మమ్ము కాపాడి బ్రోవుమయ్య ఏ పాపము మమ్మున్ ఏల నియ్యకుండ మాపు రేపులుమమ్ము మనిపి బ్రోవుమయ్య||
కన్న తండ్రికంటెను కనికరమున కాపాడెడి మా దేవా అన్న దమ్ములవలె మే మందరిని ప్రేమించి మన్ననతో...
Vinave na vinathi nivedhana dhaya velayaga no వినవే నా వినతి నివేదన దయ వెలయఁగ నో
Song no: #49
వినవే నా వినతి నివేదన దయ వెలయఁగ నో ప్రభువా నిను శర ణొందితి ననుఁ గుశలంబున నునుపవె యో ప్రభువా ||వినవే||
నిర్మల గతి సంధ్యా కాలంబున నీ స్తవమగు ప్రభువా ధర్మదీప్తి నా కొసఁగి చేయు దీప్తవంతునిగ నన్ను ||వినవే||
నీ మహదాశ్రయ మొసఁగి దుర్గతిని నేఁబడకుండఁగను నా మది తన్వాది సమస్తముతో ననుఁ గావవె ప్రభువా ||వినవే||
ఎన్ని దినంబులు జగతి నున్న నీ కన్న...
Deva neeku sthothramu e rathrilo ni velugu dheevenakai దేవ నీకు స్తోత్రము ఈ రాత్రిలో నీ వెలుఁగు దీవెనకై
Song no: #50
దేవ నీకు స్తోత్రము ఈ రాత్రిలో నీ వెలుఁగు దీవెనకై కావుము నన్నిప్పుడు రాజుల రాజా ప్రోవు రెక్కల నీడలో ||దేవ||
పూని యేసుని పేరిటన్ మన్నించుము కాని పనులను జేసినన్ నేను నిదురపోవక ముందే సమాధాన మిమ్ము నాకు ||దేవ||
చావు నొందుట కెన్నడు భీతి లేక జీవింప నేర్పించుము జీవ పునరుత్థానము లో మహిమతో లేవ మడియ నడ్పుము ||దేవ||
నేను జీఁకటి నిద్రను రోయుచుఁ...
Dhinamu gathiyimmchenu dhinanadhuda pradhri venukdage దినము గతియించెను దిననాధుఁడ పరాద్రి వెనుకడాఁగె
Song no: #51
దినము గతియించెను దిననాధుఁడ పరాద్రి వెనుకడాఁగె నిఁ కమా మునిమాపు సంస్తవముఁ గొనుము సంప్రీతిమై ఘనుఁడ దేవా ||దినము||
సరవినంబరవీధి సంజ కెంజాయలు మురువుఁజూపె ప్రభువా దొరము నీ ముఖకాంతి కిరణ జాలము మాపై నెఱపరమ్ము ||దినము||
కటికి చీఁకటులు దిక్తటములఁ గలిపియు త్కటములైన నీ చెం గట నున్న నెట్టి సంకటమేని మమ్ముఁ దాఁకుటకు జంకు ||దినము||
తలఁపువలనను నోటి...
Aakasambu bhumiyu anthata chekati yayenu ఆకాశంబు భూమియు అంతట చీకటి యాయెను
Song no: #52
ఆకాశంబు భూమియు అంతట చీకటి యాయెను ప్రాకెడు చీకటి సమయమున ప్రార్థన చేతుము మా దేవా||
చక్కని చుక్కలు మింటను చక్కగా మమ్మునుజూడగ ప్రక్కకు రావె వేగముగా ప్రభువా గావుము గావుము నీ నీడన్||
చిన్న చిన్న పక్షులు చిన్న చిన్న పూవులు ఎన్నో ఎన్నో జీవులు నిన్నే గొలిచి నిద్రించున్||
చిన్న చిన్న పాపలు చిన్న చిన్న పడకలలో చిన్న కన్నులు మూయంగా చెన్నుగ యేసూగావుమా||
నేలను...
Saatileni dhaivama na yesayya సాటిలేని దైవమా నా యేసయ్యా
సాటిలేని దైవమా నా యేసయ్యా
మాటతోనే చేతువు ఏ కార్యమైనా (2)
తోడు నీడగా వెంట ఉందువు
అన్ని వేళలా ఆదుకొందువు (2) "సాటిలేని"
బండ నుండి నీటిని - ప్రవహింప జేసావు
ఎండిన యెముకలలో - జీవాన్ని పోసావు (2)
నీవే నాతో ఉండగా - అపజయమే లేనేలేదుగా (2) "తోడు నీడగా"
ఆశగల ప్రాణాన్ని - సంతృప్తి పరచావు
ఆకలిగొను వారిని - మేలుతో నింపావు (2)
నీవే నాతో ఉండగా -...
Peenugu unna chota graddhala gumppulamta పీనుగు ఉన్న చోట గ్రద్దల గుంపులంట
పీనుగు ఉన్న చోట గ్రద్దల గుంపులంట
అందులు చూపు బాట గుంటకు చేర్చునంట
మోసపోయేవాడు ఉన్నంత కాలం
మోసాగించేవాడికి పంచభక్ష్య పరమాన్నం
పడిపోయేవాడు ఉన్నంత కాలం
పడద్రోసేవాడికి నిత్యకళ్యాణం పచ్చతోరణం *పీనుగు**
గొర్రెచర్మం కప్పుకున్న తోడేళ్ళ గుంపులవెంట
మోసపోయి సాగుతున్న జ్ఞానంలేని మనుష్యులంట
చెట్టుమంచిదైతే దాని ఫలము కూడా మంచిదేగా ....
ముండ్లపొదలలోన మీకు ద్రాక్షపండ్లు ...
Yennenno kalalu kanna na chinni thanaya ఎన్నెన్నో కలలు కన్న నా చిన్ని తనయ
ఎన్నెన్నో కలలు కన్న - నా చిన్ని తనయ
ఆశలెన్నో పెట్టుకున్న - ఓ ప్రియ తనయ
నీవేగా నాప్రాణం - నీవేగా నా లోకం
నీవేగా నా రూపం - నా కన్నా
పిలిచినా ఎంత పిలిచినా పలుకవే - బదులివ్వవే ||2||
ప్రేమించే తండ్రిపై - కోపము తగునా
కాక్షించే కళ్లకే - కన్నీళ్లే మిగిలేనా
గునపాలు గుచ్చకయా - నా గుండెలో
గాయాలు చేయకయ్యా ||2||
వేదకినా ఎంత వేదకినా దొరకవే నాకు దొరకవే
నా కన్నా...
Nayakudavu neevu kreesthu sevakudavu neevu నాయకుడవు నీవు క్రీస్తు సేవకుడవు నీవు
నాయకుడవు నీవు - క్రీస్తు సేవకుడవు నీవు
మాదిరికరము అనేకులకు - నీ జీవితం (4)
నిలిచే శిఖరమై నడిచే సైన్యమై - రగిలే జ్వాలవై వెలిగే జ్యోతివై (2)
మాదిరికరముగా మాకు తోడుగా - మమ్మును నడిపిన నీవే
మా అన్నగ తండ్రిగ మాకు అండగా - మాతో ఉన్నది నీవే (2)
సేవలో నలుగుతూ నవ్వుతూ భోదిస్తూ కడుగుతూ వెలిగించే దీపమా (2)
గతిలేని మమ్ము గుర్తించి మాకు గురినే చూపించావే...
Na manchi silpakaruda nanu nee rupulo chekkithivi నా మంచి శిల్పకారుడా నను నీ రూపులో చెక్కితివి
నా మంచి శిల్పకారుడా నను నీ రూపులో చెక్కితివి (2)
నా మంచి కాపరి నా యేసయ్య (2)
నను నీ మార్గములో నడిపించుచుంటివి (2) " నా మంచి"
నీదు సమరూపమే నేను ఆశించితిని నా ఆశలన్నీ నీవే తీర్చితివి (2)
నా ఎదుట ద్వారములు తెరిచితివి (2)
ముగింపువరకు నను నడిపితివి (2) "నా మంచి"
నీవు జయించిన వారికి నీ స్తంభముగా నీ మందిరములో నిలబెట్టితివి (2)
నా ఎదుట ద్వారాములు తెరిచితివి...
Nee prematho nannu nimpumu deva నీ ప్రేమతో నన్ను నింపుము దేవా
1 కొరిథి 13:13
నీ ప్రేమతో నన్ను
నింపుము దేవా
నీ ప్రేమను పంచుట
నేర్పుము దేవా "2"
జ్ఞానమున్న కాని
విశ్వాసమున్న కాని
ప్రవచింప గల్గినకాని
ప్రేమలేని వాడనైతే
వ్యర్థుడనయ్య "2"
" నీ ప్రేమతో "
(1)
నీ ప్రేమ సహానం కలది
నీ...
Preminchedha yesu raja ninne preminchedha ప్రేమించెద యేసు రాజా నిన్నే ప్రేమించెద
ప్రేమించెద యేసు రాజా
నిన్నే ప్రేమించెద (2)
ప్రేమించెద ప్రేమించెద ప్రేమించెదా ఆ ఆ ఆ
ప్రేమించెద ప్రేమించెద ప్రాణమున్నంతవరకు
నే మట్టిలో చేరే వరకు
నా ప్రాణమున్నంతవరకు
నే మహిమలో చేరే వరకు
ఆరాధించెద యేసు రాజా
నిన్నే ఆరాధించెద (2)
ఆరాధించెద ఆరాధించెద ఆరాధించెదా ఆ ఆ ఆ
ఆరాధించెద ఆరాధించెద ప్రాణమున్నంతవరకు
నే మట్టిలో చేరే వరకు
నా ప్రాణమున్నంతవరకు
నే మహిమలో చేరే...
Vijaya veeruda yesu prabhuva jayamu jayamu neeke విజయ వీరుడా యేసుప్రభువా జయము జయము నీకే
పల్లవి: విజయ వీరుడా యేసుప్రభువా– జయము జయము నీకే
అపజయమెరుగని యుద్దశూరుడ — జయము జయము నీకే (2)
జయమూ…విజయమూ …(2)
సైన్యములకు అధిపతి నీవే (2)
విజయ వీరుడా యేసుప్రభువా — జయమూ జయమూ నీకే
అపజయమెరుగని యుద్దశూరుడా — జయమూ జయమూ నీకే
1. భయము వణకు కలిగెను – అపవాదికి (అపవాదికీ)
తోక ముడిచి పారిపోయెను – సిగ్గుతో (సిగ్గుతో) (2)
నీ బలము చూచిన శత్రువుకు – చెమటలు పట్టెను
తరుముకొచ్చిన...
O dhehama na sarirama nikidhi nyayama ఓ దేహమా నా శరీరరమా నీకిది న్యాయమా
పల్లవి: ఓ దేహమా నా శరీరరమా నీకిది న్యాయమా నీకిది ధర్మమా
నను చెరుపుటే నీ ధ్యేయమా నను భక్షించుటే నీకానందమా
చరణం 1 :
ఆత్మకు ఆహారం కొరకు తిరుగుచున్న వేళలలో ఎన్నోవాటితో నన్ను కదలకుండా కట్టేసినావు
కొంచమైన జాలి నాపై చూపకుండా వింత వింత విందులలో ఉత్సహించినావు
చరణం 2 :
కన్నులలోని కెమెరా పాపాన్నే చూస్తున్నది ఊరకుండక మనసే నన్ను ప్రేరేపిస్తూ ఉన్నది
చూసినవి...
Batasari o batasari vinavayya okkasari బాటసారి ఓ బాటసారి,వినవయ్యా ఒక్కసారి
బాటసారి ఓ బాటసారి వినవయ్యా ఒక్కసారి|2|
పయనించే బాటసారి,బాటసారి ఓ బాటసారి
వినవయ్యా ఒక్కసారి
వెండి తాడు విడిపోవును
బావి యొద్ద చక్రం పడిపోవును |2|
ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే |2|
నీటి బుడగలాంటిదీ జీవితం |2|
విసిరి వెళ్ళి మరలా రాని గాలి వంటిది |2|
||బాటసారి||
పరదేశులం యాత్రీకులం
శాశ్వతం కాదు ఈ దేహం |2|
మన్నైనది వెనుకటి వలె మన్నైపోవును |2|
ఆత్మ దేవుని యొద్దకు...
Na priyuda yesayya na sailama rakshana srumgama నా ప్రియుడా యేసయ్య నా శైలమా రక్షణ శృంగమ
నా ప్రియుడా యేసయ్య..........
నా శైలమా రక్షణ శృంగమ........
యుగయుగాలు నిన్నే వివరించెద
నా స్వాస్థమ నిన్నే దరియించెద
నిన్నే సేవించెద.....................
" నా ప్రియుడ "
(1)
పరిమళించెనే ప్రతివసంతము.......
మధురమైన...
Siluvalo aa siluvalo a ghora kalvarilo సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో
సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో
సిలువలో ఆ సిలువలో
ఆ ఘోర కల్వరిలో
తులువలా మధ్యలో వ్రేలాడిన యేసయ్యా ॥2॥
వెలియైన యేసయ్యా
బలియైన యేసయ్యా
నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా ॥2॥
...
Yesu raka tharuna maye nivu siddhama sodhara యేసు రాక తరుణ మాయే నీవు సిద్దమా సోదర
యేసు రాక తరుణ మాయే
నీవు సిద్దమా ! సోదర!
ఆ పవిత్రుని చేరుటకు
అర్హురాలివా? సోదరి! || 2 ||
తలుపు కొట్టి పిలిచినప్పుడు
పలుకుటకు నీకు సాధ్యమా!
తండ్రి రాజ్యం చేరుటకు
ఇదియే తరుణం ఓ సంఘమా || 2 ||
పగిలిన నీ హృదయమయిన
వదలకుండా చేర్చుకోనును
విరిగిన నీ మనసునయిన
విడువకుండా అదుకోనును ॥ 2 ॥
నీదు పాపం కొండ అయిన
నిండుగా క్షమియించు వాడు
నీదు గిన్నె...
Nee numdi veedi ne brathakagalana na margama నీ నుండి వీడి నే బ్రతకగలనా నా మార్గమా నాసత్యమా
నీ నుండి వీడి నే బ్రతకగలనా ||2||
నా మార్గమా నాసత్యమా
నా జీవమా నా సర్వమా
ఆదిలో వాక్కును పలికిన దేవా
ఈ సృష్టిని చేసిన ప్రభువా
నీ కుమారుని పంపినదేవా
మమ్ము రక్షించిన ప్రభువా
నీ ప్రేమ ప్రకటింప నా తరమా
నీ మహిమ గ్రహింప నాకు సాధ్యమా ||నా మార్గమా||
నీ రూపమును ఇచ్చిన దేవా
నాకు ప్రాణం పోసిన దేవా
నన్ను పేరుతో పిలిచిన దేవా
నన్ను దీవించిన ప్రభువా
నువ్వులేక నేనేమి...
Yemani pogadudha deva nee krupalo nee premalo ఏమని పొగడుద దేవా నీ కృపలో నీ ప్రేమలో
ఏమని పొగడుద దేవా
నీ కృపలో నీ ప్రేమలో
నేను పొందిన వరములకై
దేవా ప్రభువా దేవా నా ప్రభువా
ప్రభు నీకు సాటేవరు
నిన్ను పోలిన వారెవరు
కడలి పొంగు నడిచెదము
సంద్రమును అనచెదము
విజయములు ఒసగెదవు
||ఏమని||
నీవే నా జనకుడవు
నీవే నా దేవుడవు
జేష్ఠునిగా నన్ను నిలిపి
అధికునిగా దీవించి
శుభములతో దీవించి
...
Silanaina nannu silpivai marchavu naloni శిలనైన నన్ను శిల్పివై మార్చావు నాలోని
శిలనైన నన్ను శిల్పివై మార్చావు
నాలోని ఆశలు విస్తరింపచేశావు /2/
నీప్రేమనాపై కుమ్మరించుచున్నావు /2/
నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నాకాపరి /2/శిల/
1.మొడుబారిన నాజీవితం – నీప్రేమతోనే చిగురింపచేసావు /2/
నీప్రేమాభిషేకం నాజీవిత గమ్యం /2/
వర్ణించలేను లెక్కించలేను /2/నీ ప్రేమే/
2.ఏవిలువలేని అభాగ్యుడను నేను – నీప్రేమ చూపి విలువనిచ్చి కొన్నావు /2/
నాయెడల నీకున్న...
Neeve neeve na sarvam neeve samastham neeve నీవే నీవే నా సర్వం నీవే సమస్తము నీవే
llపllనీవే నీవే నా సర్వం నీవే సమస్తము నీవే
నీవే నీవే నా జీవం నీవేే సహాయము నీవేll2ll
నీ స్నేహము కోరి ఎదురు చూస్తున్నాll2ll
ఎదురు చూస్తున్నా యేసయ్యా
ఎదురు చూస్తున్నా
...
Prabhuva ninnaradhimpanu jerithimi ప్రభువా నిన్నారాధింపను జేరితిమి
Song no: #46
ప్రభువా నిన్నారాధింపను జేరితిమి యుదయ శుభకాంతి ప్రభవింపఁగా దేవా నేఁడు శుభకాంతి విరజిమ్మఁగా విభవముగను ప్రభాకరముగను విరియు నీ తేజంబెలర్పఁగ నభి దనంబులఁగూడి భక్తిని యాత్మతో సత్యంబుతోడను ||ప్రభువా||
ఇరులుం గమ్మిననుండి యరుణోదయము దనుక నరిగాపు నీవే కాదా దేవా రాత్రి యరిగాపు నీవేకాదా విరివిగా మా హృదయసీమల నెరసి యుండిన చీఁకటులుఁబో దరిమి శాంతంబైన...
Vededha nadhagu vinathini gaikonave jagadheesha వేడెద నాదగు వినతిని గైకొనవే జగదీశ
Song no: #45
వేఁడెద నాదగు వినతిని గైకొనవే జగదీశ ప్రభో నేఁడు ప్రతిక్షణ మెడబాయక నా తోడ నుండవె ప్రభో ||వేఁడెద||
ప్రాతస్తవము భవత్సన్నిధి సర్వంబున నగు నాదౌ చేతస్సున ధర్మాత్మను సంస్థితిజేయవె సత్కృపను ||వేఁడెద||
నేఁ బాతకి నజ్ఞానుఁడఁ ప్రభువా నీవు కరుణజేయు పాపాచరణము నందున జిత్తము బాపుము నాకెపుడు ||వేఁడెద||
పాపముఁ గని భీతుఁడనై శంకా పరత సతము నుండన్ నా పైనుంచుము...
Sakala jagajjala kartha samgha hrudhaya సకల జగజ్జాల కర్తా భక్త సంఘ హృదయ
Song no: #44
సకల జగజ్జాల కర్తా భక్త సంఘ హృదయ తాప హర్తా యకలంక గుణమణి నికర పేటీ కృత ప్రకట లోకచయ పరమ దయాలయ ||సకల||
నాదు నెమ్మది తొలఁగించుచుఁ బ్రతి వాదు లీమెయి నెంతో పాదుకొన్నారు బాధలందైనను సాధులఁభ్రోవ ననాది యైనట్టి నీవాధారమైయుండ ||సకల||
దినకృత్యములఁ గష్టమంత చీఁకటినినే నీ కడ భక్తి మనవిజేయ వినుచు నా కష్టము వెస నష్టముగఁ జేయ ఘనముగ నాయందుఁ గరుణఁ జేసితివి...
Yesu karthanu seva jeyutaku melkonu యేసు కర్తను సేవఁ జేయుటకు మేల్కొను
Song no: #43
శ్రీ యేసు కర్తను సేవఁ జేయుటకు మేల్కొను శ్రీయేసు కర్తను శ్రేయముల నెఱింగి నీకు రేయిపవ లొసంగి యెడఁ బాయని యంతరంగి యపాయంబుఁ ద్రోయ సహాయంబుఁజేయ ||శ్రీ యేసు||
నిదురయందు నేఁడు క్షేమ మొదవఁ గాచినాఁడు సూర్యుఁడుదయ మాయెఁజూడు నీ హృదయమున సదమల పదవులుదయింప ||శ్రీ యేసు||
అంధకార మణఁగెన్ హృదయాంధకార మణఁగెన్ ప్రభు నందుఁ దెలివి గలుగన్ నిబంధనలు డేందమున కందముగఁ...
Thellavarina vela deli vomdhi mana kreesthu dhivya తెల్లవారిన వేళఁ దెలి వొంది మన క్రీస్తు దివ్య నామముఁ బాడెరె
Song no: #42
తెల్లవారిన వేళఁ దెలి వొంది మన క్రీస్తు దివ్య నామముఁ బాడెరె యో ప్రియులార దివస రక్షణ వేఁడరే తల్లి రొమ్మున దాఁచు పిల్ల రీతిని మనలఁ జల్లదనముగ రాతి రెల్లఁ గాచిన విభునిఁ ||దెల్లవారిన వేళ||
నిద్రపోయిన వేళ నిఖిలాపదులఁబాపి నిశలన్ని గడుపు విభునిన్ భద్రముగ వినతించి భయభక్తితో మనము ముద్రి తాక్షులఁ గేలు మోడ్చి మ్రొక్కుచును ||దెల్లవారిన వేళ||
భానుఁడుదయం...
Melukonare mee manabula melimiga mi mera dhappaka మేలుకొనరే మీ మనంబుల మేలిమిగ మీ మేరఁ దప్పక పాలు
Song no: #41
మేలుకొనరే మీ మనంబుల మేలిమిగ మీ మేరఁ దప్పక పాలు మాలక లేచి దేవుని పాదములు పూజింప గ్రక్కున || మేలుకొనరే ||
దిక్కు లెల్లను దేజరిల్లెను దినకరుండుదయింపనయ్యెను మ్రొక్కులకు ప్రతిఫలము నిచ్చెడు మూల కర్తకుఁ గొలువసేయఁగ || మేలుకొనరే ||
పక్షులెల్లను గిలకిలంచును బ్రభుని మహిమలు బల్కఁ దొడఁగెను రక్షకుని సకలోపకృతులను రమ్యముగ నుతియించి పాడఁగ ...
Shuddhi suddhi shuddhi sarvasaktha prabhu శుద్ధి, శుద్ధి, శుద్ధి! సర్వశక్త ప్రభు
Song no: #40
శుద్ధి, శుద్ధి, శుద్ధి! సర్వశక్త ప్రభు ప్రాతఃకాలస్తుతి నీకీ చెల్లింతుము శుద్ధి, శుద్ధి, శుద్ధి! కృపగల దేవా! ముగ్గురైయుండు దైవత్ర్యేకుఁడా!
శుద్ధి, శుద్ధి, శుద్ధి! అని పరమందుఁ బరవాసు లెల్ల నిన్నేశ్లాఘింతురు శెరపుల్ ఖెరూబుల్ సాష్టంగపడి నిత్యుఁడవైన నిన్ నుతింతురు.
శుద్ధి, శుద్ధి, శుద్ధి! తేజరిల్లు దేవ పాపి కన్ను చూడలేని మేఘ వాసివి అద్వితీయప్రభు,...
Nrupa vimochaka prabhu veladhi nolla nee krupa నృపా విమోచకా ప్రభూ వేలాది నోళ్ల నీ కృపా జయప్రభావముల్
Song no: #39
నృపా! విమోచకా! ప్రభూ వేలాది నోళ్ల నీ కృపా జయప్రభావముల్ నుతింతు నెంతయున్.
కృపాధికార! దేవ! నీ సాయంబు జేయుమా భవత్ర్పభావ కీర్తులన్ జాటంగ నెల్లెడన్.
భయంబు చింతఁ బాపును హర్షంబు పాపికి సౌఖ్యంబు జీవశాంతులు నీ నామ మిచ్చును.
విముక్తి జేయు ఖైదిని పాపంబు బాపును పాపాత్ము శుద్ధుజేఁయును శ్రీయేసు రక్తము.
జనాళి! పాపు లెల్లరు! శ్రీయేసున్ నమ్ముఁడి కృపావిముక్తులందుఁడి...
Krupagala devuni sarvadha nuthinchudi కృపగల దేవుని సర్వదా నుతించుఁడి
Song no: #38
కృపగల దేవుని సర్వదా నుతించుఁడి దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండును.
సర్వశక్తుఁడాయనే సర్వదా చాటించుఁడి దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండును
పగటి నేలునట్లు సూర్యునిన్ సృజించెను దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండును.
సర్వజీవకోటిని బ్రోచు దేవుఁ డెన్నఁడు దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండును.
కర్త మనయందును కనికర ముంచెను దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల...
Makartha gatti dhurgamu ne nammu ayudhambu మాకర్త గట్టి దుర్గము నే నమ్ము ఆయుధంబు
Song no: #37
మాకర్త గట్టి దుర్గము నే నమ్ము ఆయుధంబు సంప్రాప్తమైన కష్టములన్నిటి నణంచు ఆ పాత శత్రువెంతో క్రూరుఁడు తదాయుధములుపాయ శక్తులు అతం డసమానుండు.
మేమో నశించిపోదుము మా శక్తి నిష్ఫలంబు మాకై ప్రభుని శూరుఁడు యుద్దంబు చేసిపెట్టు అతం డెవ్వఁడు? యేసు క్రీస్తను మా రక్షకుండు మరొక్కఁ డెవ్వడు? అతండె గెల్పుపొందు
ప్రపంచ మంతటన్ గ్రమ్ము పిశాచు లేమి చేయు? మమ్మెల్ల...
Kamandhula kasithananiki baliavuthundhi pasithanam కామాంధుల కసితనానికి బలిఅవుతుంది పసితనం
కామాంధుల కసితనానికి బలిఅవుతుంది పసితనం..
రసికందుల రతివ్రతానికి పసికందుల తర్పణం... "2"
కడుపురగిలి క్షుద్బాదను తట్టుకునే జీవనం.
గుండెపగిలి గొంతుఎండి అడుగుతుంది కారణం
సమాజాన్ని ప్రశ్నించే చిన్నతనం
ఈ సమాజానికె ఎంతో చిన్నతనం...
ఆకలి అన్నవారికి అన్నము పెట్టనోడురా అనాథ అంటే..
దిక్కులేనివారికి దారిచూపనోడురా అనాథ అంటే..
కడుపులు చేసినోళ్ళురా..కనిపారేసినోళ్ళురా...
కరుణేలేనివాళ్ళురా...
Sarvadhbuthambulan sarvathra jeyukarthan సర్వాద్భుతంబులన్ సర్వత్రఁ జేయుకర్తన
Song no: #36
సర్వాద్భుతంబులన్ సర్వత్రఁ జేయుకర్తన్ సర్వాత్మ లింతటన్ శ్లాఘింపఁ జేరరండి! మా రాకపోకలన్ మం వీడకుండను మా రక్షకుండిట్లే మమ్మాదరించును
మహా దయాళుఁడే మా జీవకాలమంత సహాయమూరటన్ సంతోషమిచ్చుగాక! మహత్తు ప్రేమను మాయందు నుంచును ఇహంబునన్ మమ్మున్ ఎన్నండుఁ బ్రోచును.
ప్రపంచపాలకా! ప్రసిద్ధుఁదైన తండ్రీ! సుపుత్ర దేవుడా! సుజీవమిచ్చు నాత్మ! సంపూర్ణ త్ర్యేకుండా!...
Iennallu maku sayamai yi mundhukunu ఇన్నాళ్లు మాకు సాయమై యీ ముందుకును
Song no: #35
ఇన్నాళ్లు మాకు సాయమై యీ ముందుకును మా యున్నత గృహ మండవై యొప్పెడు దైవమా!
ఏలాటి యీతిబాధయు నీవచ్చు యేఁటిలో కలుగకుండఁ బ్రోవవే ఘనంపు ప్రేమతో
నీ సింహాసన నీడలో నిలుచు భక్తులు భయంబు చింతబాధలన్ జయించి మందురు
చరాచరంబు లెల్లను జనించుకంటె ముందార తరాలనుండియున్ నీరాజ్య మండెడున్
ఇన్నాళ్లు మాకు సాయమై యేలుచుఁ గాచిన ఉన్నత ప్రభు ప్రేమతో మన్నించు ...
Sarvesa rammu nee sannidhi kanthi nosamgu maku సర్వేశా రమ్ము నీ సన్నిధి కాంతి నొసంగు మాకు
Song no: #34
సర్వేశా! రమ్ము నీ సన్నిధి కాంతి నొసంగు మాకు సత్య సనాతన సర్వాధికారుఁడా సదా మమ్మేలుము సర్వోన్నతా!
నిత్యంపు వాక్యమా! నీదగు ఖడ్గము నిమ్ము మాకు నీ నిజ భక్తులన్ నీ వాక్య ప్రియులన్ నింపు నీ యాత్మతో నింపు మీర
రమ్ము మహాత్మ! మా కిమ్ము నీ యాత్మను రమ్ము వేగ రక్తితో నిప్పుడు రమ్ము మా మధ్యకు రక్షించు మమ్మును రంజిల్లఁగన్
స్తోత్రం పవిత్రుఁడా! స్తోత్రంబు...
Yehova gaddhe mumdhata janambulara mrokkudi యెహోవ గద్దె ముందట జనంబులార మ్రొక్కుఁడి
Song no: #33
యెహోవ గద్దె ముందట జనంబులార మ్రొక్కుఁడి యెహోవ దేవుఁడే సుమీ సృజింపఁ జంపఁ గర్తయే
స్వశక్తిచేత నాయనే మమున్ సృజించె మట్టిచే భ్రమించు గొఱ్ఱె రీతిగాఁ దప్పంగ మళ్లీ చేర్చెను
సుకీర్తి పాడి గుంపులై ప్రసిద్ధిచేతు మాయనన్ జగత్తు వేయి నోళ్లతో స్తుతించు దివ్యమౌ ధ్వనిన్
ప్రభుత్వ ముండు నంతకున్ అగున్ నీ ప్రేమ నిత్యము చిరంబు నీదు సత్యము వసించు నెల్లక...
Dhahana bali neeku nanistamu mariyu dhaiva balulu దహన బలి నీకు ననిష్టము మరియు దైవ బలులు
Song no: #32
దహన బలి నీకు ననిష్టము మరియు దైవ బలులు విరిగిన యాత్మయే యెహోవ దేవ విరిగి నలిగిన యట్టి హృదయం బలక్ష్యంబు సేయవు ||దహన||
నీ కటాక్షముతో సీయోనున కిపుడే నెనరుతోడను మేలు చేయుమి ప్రాకటంబుగను యోరూషలే మునకుఁ బ్రాకారములను గట్టించుమి ||దహన|
అంతట నీతియుక్తంబు లౌ బలుల యాగముల సర్వాంగ హోమముల్ ఎంతో యిష్టంబౌ బలిపీఠము మీఁద నెన్నో కోడెల జనులర్పించుతురు...
O prabhunda nin nuthimchu chunnamu vinayamu thoda ఓ ప్రభుండా నిన్ నుతించు చున్నాము వినయముతోడ
Song no: 31
ఓ ప్రభుండా నిన్ నుతించు చున్నాము వినయముతోడ మా ప్రభుండ వంచు నిన్ను మానక మేమొప్పుకొందు ||మో||
నిత్యుఁడవౌ తండ్రి లోకము నిన్నారాధించుచు నుండు సత్యదూతల్ మోక్షమందు సర్వ ప్రధానుల్ సుభక్తిన్ నిత్య మేక కంఠముతోడ నిన్ గొనియాడుచున్నారు ||ఓ||
పరిశుద్ధ, పరిశుద్ధ పరిశుద్ధ,సేనల దేవా ధరపరలోకంబులు నీ వర మహిమతో నోప్పునటంచు ||నో||
కెరూబుల్ సెరూపుల్ నిన్నుఁ...
Maa yesu kreesthu neeve mahimagala rajuvu nivu neene మా యేసు క్రీస్తు నీవే మహిమగల రాజవు నీవు నీవే
Song no: #30
మా యేసు క్రీస్తు నీవే మహిమగల రాజవు నీవు నీవే తండ్రికి నిత్యకుమారుడవు ఓ క్రీస్తూ||
భూనరులన్ రక్షింపఁ బూనుకొనినప్పుడు దీన కన్యాగర్భమున్ దిరస్కరింపలేదుగా ఓ క్రీస్తూ||
విజయము మరణపు వేదనపై నొందఁగా విశ్వాసులందరికిన్ విప్పితివి మోక్షమున్ ఓ క్రీస్తూ||
నీవు తండ్రిదైనట్టి నిత్య మహిమయందు దేవుని కుడివైపుఁ దిరముగాఁ గూర్చున్నావు ఓ క్రీస్తూ||
నీవు...