Prabhu yesu na rakshaka nosagu kannulu naku nirathaamu ne ప్రభు యేసు నా రక్షకానొసగు కన్నులు నాకునిరతము నే నిన్ను జూడ

Song no: 457
HD

    ప్రభు యేసు నా రక్షకానొసగు కన్నులు నాకునిరతము నే నిన్ను జూడ (2)
    అల్ఫయు నీవే – ఒమేగయు నీవే (2)      ॥ప్రభు యేసు॥

  1. ప్రియుడైన యోహాను పత్మాసులోప్రియమైన యేసు నీ స్వరూపము (2)
    ప్రియమార జూచి బహు ధన్యుడయ్యెప్రియ ప్రభు నిన్ను జూడనిమ్ము (2)      ॥ప్రభు యేసు॥

  2. లెక్కలేని మార్లు పడిపోతినిదిక్కులేనివాడ నేనైతిని (2)
    చక్కజేసి నా నేత్రాలు దెరచిగ్రక్కున నిన్ను జూడనిమ్ము (2)       ॥ప్రభు యేసు॥

  3. ఎరిగి యెరిగి నే చెడిపోతినియేసు నీ గాయము రేపితిని (2)
    మోసపోతి నేను దృష్టి దొలగితిదాసుడ నన్ను జూడనిమ్ము (2)       ॥ప్రభు యేసు॥

  4. ఎందరేసుని వైపు చూచెదరోపొందెదరు వెల్గు ముఖమున (2)
    సందియంబు లేక సంతోషించుచుముందుకు పరుగెత్తెదరు (2)       ॥ప్రభు యేసు॥

  5. విశ్వాసకర్తా ఓ యేసు ప్రభూకొనసాగించువాడా యేసు ప్రభూ (2)
    వినయముతో నేను నీ వైపు జూచుచువిసుగక పరుగెత్త నేర్పు (2)       ॥ప్రభు యేసు॥

  6. కంటికి కనబడని వెన్నియోచెవికి వినబడని వెన్నియో (2)
    హృదయ గోచరము కాని వెన్నియోసిద్ధపరచితివ నాకై (2)         ॥ప్రభు యేసు॥

  7. లోక భోగాలపై నా నేత్రాలుసోకకుండునట్లు కృప జూపుము (2)
    నీ మహిమ దివ్య స్వరూపమునునిండార నను జూడనిమ్ము (2)      ॥ప్రభు యేసు॥

  8. ప్రభు యేసుని వదనములో – నా దేవుడు కనిపించె (2)
    పాపాత్ముల బ్రోచుటకై – కృపలొలికిన కలువరిలో (2)
    పరలోకముకై – చిర జీవముకై (2)
    ప్రార్ధించెను నా హృదయం       ॥ప్రభు యేసుని॥

  9. దిశలన్నియు తిరిగితిని – నా పాపపు దాహముతో (2)
    దౌష్ట్యములో మసలుచును – దౌర్జన్యము చేయుచును (2)
    ధన పీడనతో – మృగ వాంఛలతో (2)
    దిగాజారితి చావునకు        ॥ప్రభు యేసుని॥

  10. యేసు నీ రాజ్యములో – భువి కేతెంచెడి రోజు (2)
    ఈ పాపిని క్షమియించి – జ్ఞాపకముతో బ్రోవుమని (2)
    ఇల వేడితిని – విలపించుచును (2)ఈడేరెను నా వినతి       ॥ప్రభు యేసుని॥

  11. పరదైసున ఈ దినమే – నా ఆనందములోను (2)
    పాల్గొందువు నీవనుచు – వాగ్ధానము చేయగనే (2)
    పరలోకమే నా – తుది ఊపిరిగా (2)
    పయనించితి ప్రభు కడకు      ॥ప్రభు యేసుని॥
Share:

No comments:

Post a Comment

Popular Products

Labels

Blog Archive

Recent Posts

Unordered List

  • Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit.
  • Aliquam tincidunt mauris eu risus.
  • Vestibulum auctor dapibus neque.

Pages