Kalam samayam nadhenantu anukuntunnava కాలం సమయం నాదేనంటూ అనుకుంటున్నావా

ly
0

Song no:

కాలం సమయం నాదేనంటూ అనుకుంటున్నావా
రోజులు అన్ని నావేనంటూ జీవిస్తున్నావా (2)
దేవుని ముందు నిలిచే రోజుంది
తక్కెడ తూకం వేసే రోజుంది (2)
జీవ గ్రంథం తెరిచే రోజుంది
నీ జీవిత లెక్క చెప్పే రోజుంది
ఆగవేమయ్యా ఈ మాట వినవయ్యా
ఆగవేమయ్యా నీ మనస్సు మార్చుకోవయ్యా (2)        ||కాలం||

ధనము బలము ఉన్నదని విర్రవీగుతున్నావా
మేడలు మిద్దెలు ఉన్నాయని అనుకుంటున్నావా (2)
గుజరాతును చూడవయ్యా ఎంత ఘోరమో
ఒక్క ఘడియలెందరో బికారులయ్యారు (2)         ||ఆగవేమయ్యా||

చూసావా భూకంపాలు కరువులు విపరీతాలు
పరిశుద్ధ గ్రంథములోని కడవరి కాలపు సూచనలు (2)
నిన్నటి వరకు కొదువ లేదని అనుకున్నారు
ఒక్క ఘడియలో ఎందరో నశించిపోయారు (2)         ||ఆగవేమయ్యా||

సిద్ధపడిన వారి కోసం పరలోకపు ద్వారాలు
సిద్ధపడని వారికి ఆ నరకపు ద్వారాలు (2)
అగ్ని ఆరదు పురుగు చావదు
నిత్యం ఏడుపు దుఃఖాలు (2)           ||ఆగవేమయ్యా||

Post a Comment

0Comments

Post a Comment (0)