Song no:
- యేసయ్యా... యేసయ్యా...
యేసయ్యా.. యేసయ్యా..
- నీవు మోసిన సిలువను నేను.. దోషము చేసిన తులువను కాను.. (2)
సంతషించనా నిను కలిసినందుకు..
అలమటించనా నిని వీడినందుకు.. || నీవు మోసిన ||
1. మూడులు విసరగా తగిలెను రాళ్ళు.. చిందిన రుధిరమే ఆనవాళ్ళు.. (2)
జీవరహితము పొందితి వార్తా..
జీవన దాత ఎందుకీ వ్యధా.. || నీవు మోసిన ||
2. దోషులు కసిగా కొరడా విసరగా.. చీలేను దేహమే నాగటి ఛాళ్ళై.. (2)
సుందర రూప రూపము లేకా..
ఎండిన భూమిలో మొలిచిన మొక్కా.. || నీవు మోసిన ||
3. మరణ వేదికనై విలపించితిని.. అరుణ వర్ణమై తరియించితిని.. (2)
రుధిరం తాకి చిగురించితిని..
అధరంతోను నిను ముద్దాడితిని.. || నీవు మోసిన ||