Song no: 735
"నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని, ఉండబోవుచున్నదాని కోసము ఎదురుచూచు చున్నాము." హెబ్రీ Hebrews 13:14
"నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని, ఉండబోవుచున్నదాని కోసము ఎదురుచూచు చున్నాము." హెబ్రీ Hebrews 13:14
- పల్లవి : లోకమును విడచి వెళ్ళవలెనుగ
- యాత్రికులము యీ దుష్టలోకములో
పాడులోకములో మనకేది లేదు
యే విషయమందైన గర్వించలేము
జాగ్రత్తగానే నడచుకొనెదము || లోకమును ||
- కష్ట బాధలచే బ్రతుకంత నిండె
కన్నీళ్ళు నిరాశ నిస్పృహల మయము
కరుణా కటాక్షము నమ్మెదము
క్రీస్తు ప్రభునిపై దృష్టి నుంచెదము || లోకమును ||
- ఎంత వరకు యీ భువి యందుండెదమో
సైతానుతో సదా పోరాటమేగా
శత్రుని తంత్రాల నెరిగితిమి
ధైర్యముతోనే కొనసాగెదము || లోకమును ||
- గతము నంతటిని మరచిపోయెదము
గురియొద్ద కానందముతో వెళ్ళెదము
మార్గాన వచ్చేటి శ్రమల నోర్చి
అర్హులమౌదము బహుమానమొంద || లోకమును ||
- మన ఈర్ష్య కపట ద్వేషాలు విడచి
నిజ ప్రేమతోనే జీవించెదము
నిష్కళంకులమై శుద్ధులమై
పరిపూర్ణతను చేపట్టుదము || లోకమును ||
- జీవము గల ప్రభు రక్షించె మనల
విమోచించి నూతన జీవమొసగ
కొనిపోవ క్రీస్తు త్వరగా వచ్చున్
అందుచే మనము సిద్ధపడెదము || లోకమును ||
- ఆత్మీయ నేత్రాలతో చూచెదము
ఎంత అద్భుతము సౌందర్య నగరం
ప్రభువు చెంతకు వెళ్ళెదము
విజయోత్సవముతో ప్రవేశించెదము || లోకమును ||
సర్వమిచ్చటనే విడువవలెన్