Dhayachesi chudave andhala thara దయచేసి చూడవే అందాలతార మా ఇంటిదాక ఒకసారి రావే


Song no:


దయచేసి చూడవే అందాలతార
మా ఇంటిదాక ఒకసారి రావే
అలనాడు నీవు గగనాన నిలచి
ప్రభుయేసు చూచి తరియించినావే |2|
ఎక్కడెక్కడ యేసు పెరిగెనో
పెద్దలను పిన్నలను ఎలా బ్రోచెనో తల్లిదండ్రికి తగిన బిడ్డగా
గురువు దైవమనే భక్తి ఎదను నిండగా |2|
ఆకాశమందుండి నువు చూసి నావు |2|
కరుణతో తనకథ తెలియ జేయవే
ఓ నింగితార మా ఆశ తీర
శ్రీయేసు చరితం వినిపించిపోవే |దయచేసి|
ఎప్పుడెప్పుడు ఏమి చేసెనో
ఆ మహిమలన్ని నింగినుండి చూసినావుగా మేము చదవని క్రీస్తుబోధలు
తప్పకుండ నీకు తెలిసివుండి తీరునే |2|
ఆ బోధలన్ని వివరించ రావే |2|
జీవితం ధన్యమై బ్రతుకు సాగాని
అందాలతార యెరిగించిపోవే
మా జీవితాలు వెలిగించిపోవే |దయచేసి|


Share:

No comments:

Post a Comment

Popular Products

Labels

Blog Archive

Recent Posts

Unordered List

  • Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit.
  • Aliquam tincidunt mauris eu risus.
  • Vestibulum auctor dapibus neque.

Pages