Kannu theristhey velugura kannu musthey chikatira కన్ను తెరిస్తే వెలుగురా కన్ను మూస్తే చీకటిరా

Song no:

    కన్ను తెరిస్తే వెలుగురా
    కన్ను మూస్తే చీకటిరా } 2
    నోరు తెరిస్తే శబ్దమురా
    నోరు మూస్తే నిశబ్దమురా
    ఏ క్షణమో తెలియదు జీవితం అంతం
    ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం ॥కన్ను తెరిస్తే॥

  1. ఊయల ఊగితే జోల పాటరా
    ఊయల ఆగితే ఏడుపు పాటరా } 2
    ఊపిరి ఆగితే ఊగిసలాటరా
    ఊపిరి ఆగితే సమాధి పోటురా  ॥ఏ క్షణమో॥

  2. బంగారు ఊయలా ఊగినా నీవు
    భుజములపై నిన్ను మోయక తప్పదురా } 2
    పట్టు పరుపు పైనా పొర్లిన నీవు
    మట్టి పరుపులోనే ఎట్టక తప్పదురా  ॥ఏ క్షణమో॥

Nee prema naa jeevithanni neekai veliginchene yesayya నీ ప్రేమ నా జీవితాన్ని నీకైవెలిగించేనే యేసయ్య


Song no:

నీ ప్రేమ నా జీవితాన్ని
నీకైవెలిగించేనే యేసయ్య
నీ కృప సెలయేరులా నాలో ప్రవహించేనే    "2"
నను క్షమియించేనే
నను కరుణించేనే
నను స్థిరపరచేనే
నను గనపరచేనే   "2"
యేసయ్య,యేసయ్య, నా యేసయ్యా
యేసయ్య,యేసయ్య, ఓ మేసయ్యా   "2"
1.నేనునిను విడచ్చినను
నీవునను విడువలేదయ్య
దారితప్పి తోలగినను
ని దారిలో ననుచేర్చినావయ్య  "2"
ఎమివ్వగలను నీ కృపకునేను
వేలకట్టలేను నీ ప్రేమను  "2"
                        "యేసయ్య"
2.జలములునను వీడ్చినను
నీ చేతిలోనను దాచ్చినావయ్య
జ్వాలలునాపై లేచ్చినను
నీ ఆత్మతో నను కప్పినావయ్య  "2"
ఎమివ్వగలను నీ కృపకు నేను
వేల కట్టలేను నీ ఆత్మను  "2"
                         "యేసయ్య"

Neetho sneham naku pranam naatho bandham adhi nee thyagam నీతో స్నేహం నాకు ప్రాణం నాతో బంధం అది నీ త్యాగం


Song no:

నీతో స్నేహం నాకు ప్రాణం
నాతో బంధం అది నీ త్యాగం
మిత్రమా నా మిత్రమా
చిత్రము ఇది చిత్రము
పల్లవి :
మిత్రమా నా మిత్రమా
చిత్రమా ఇది నీ చిత్తమా
మిత్రమా నా యేసయ్యా
చిత్రమే ఎంతో చిత్రమే

స్నేహం నీ స్నేహం
ప్రాణం నాకు ప్రాణం
నీ స్నేహం నాకు ప్రాణం
ప్రాణం నీ స్నేహం

నా గుండెల్లో నిండావు నీవు నిండుగా
ఎదలోతుల్లో నిలిచావు నాకు తోడుగా
నా గుండెల్లో నిండావు నీవు నిండుగా
ఎదలోతుల్లో నిలిచావు నాకు తోడుగా
|| మిత్రమా - చిత్రమే ||

చరణం 1:
మట్టిని మనిషిగ మలచినావు
మనిషిని మమతతో నింపినావు
మమతకు మంచిని నేర్పినావు
మంచికి మనసును ఇచ్చినావు

మట్టిని మనిషిగ మలచినావు ఎందుకో
మనిషిని మమతతో నింపినావు ఏమిటో
మమతకు మంచిని నేర్పినావు ఎందుకో
మనసుకు మనసును కలిపినావు

ముత్యాల బాటల్లో నడిచే నీవెక్కడ
బ్రతుకంతా ముళ్ళల్లో గడిపే నేనెక్కడ
ముత్యాల బాటల్లో నడిచే నీవెక్కడ
బ్రతుకంతా ముళ్ళల్లో గడిపే నేనెక్కడ

|| మిత్రమా - చిత్రమే ||

చరణం 2:
కంటి నీరు తుడిచినావు
కంటికి రెప్పై నిలిచినావు
వింతగ నన్ను వలచినావు
తండ్రివై నన్ను పిలిచినావు

కంటి నీరు తుడిచినావు ఎందుకో
కంటికి రెప్పై నిలిచినావు ఏమిటో
వింతగ నన్ను వలచినావు ఏలనో
తండ్రివై నన్ను పిలిచినావు

రతనాల రాశులలో నిలిచే నీవెక్కడ
బ్రతుకంతా ముళ్ళల్లో గడిపే నేనెక్కడ
రతనాల రాశులలో నిలిచే నీవెక్కడ
బ్రతుకంతా ముళ్ళల్లో గడిపే నేనెక్కడ


మిత్రమా నా మిత్రమా
చిత్రమా ఇది నీ చిత్తమా
మిత్రమా నా యేసయ్యా
చిత్రమే ఎంతో చిత్రమే

స్నేహం నీ స్నేహం
ప్రాణం నాకు ప్రాణం
నీ స్నేహం నాకు ప్రాణం
ప్రాణం నీ స్నేహం

నా గుండెల్లో నిండావు నీవు నిండుగా
ఎదలోతుల్లో నిలిచావు నాకు తోడుగా
నా గుండెల్లో నిండావు నీవు నిండుగా
ఎదలోతుల్లో నిలిచావు నాకు తోడుగా
|| మిత్రమా - చిత్రమే ||

Kani vini erugani karunaku neeve akaram thandri కని విని ఎరుగని కరుణకు నీవే ఆకారం తండ్రి



Song no:

కని విని ఎరుగని కరుణకు నీవే ఆకారం తండ్రి
నీవే ఆధారం తండ్రి (2)
దయామయా నీ చూపులతో
దావీదు తనయా నీ పిలుపులతో
నీ రూపము కనిపించే
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)       ||కని||

నీ పద ధూళులు రాలిన నేలలో
మేమున్నామంటే – భాగ్యం ఉందా ఇంతకంటే
చల్లని నీ చేతులు తాకి
పులకితమైపోయే – బ్రతుకే పునీతమైపోయే
కనులారా కంటిమి నీ రూపం
మనసారా వింటిమి నీ మాట
ఇది అపురూపం – ఇది అదృష్టం
ఏమి చేసినామో పుణ్యం
మా జీవితాలు ధన్యం          ||హల్లెలూయా||


Kani Vini Erugani Karunaku Neeve Aakaaram Thandri
Neeve Aadhaaram Thandri (2)
Dayaamayaa Nee Choopulatho
Daaveedu Thanayaa Nee Pilupulatho
Nee Roopamu Kanipinche
Hallelooyaa Hallelooyaa Hallelooyaa Hallelooyaa (2)         ||Kani||

Nee Pada Dhoolulu Raalina Nelalo
Memunnaamante – Bhaagyam Undaa Inthakante
Challani Nee Chethulu Thaaki
Pulakithamipoye – Brathuke Puneethamaipoye
Kanulaaraa Kantimi Nee Roopam
Manasaara Bintimi Nee Maata
Idi Apuroopam – Idi Adrushtam
Emi Chesinaamo Punyam
Maa Jeevithaalu Dhanyam          ||Hallelooyaa||

Parishuddhudavai mahima prabhavamulaku neeve prathrudavu పరిశుద్ధుడవై మహిమప్రభావములకు - నీవే పాత్రుడవు

పరిశుద్ధుడవై మహిమప్రభావములకు - నీవే పాత్రుడవు 
బలవంతుడవై - దీనుల పక్షమై కృప చూపువాడవు 
దయాలుడవై ధారాలముగా నను దీవించిన శ్రీమంతుడా 
ఆరాధన నీకే నా యేసయ్య -2

నీ స్వాస్థ్యమైన నీవారితో కలిసి నిను సేవించుటకు
నీ మహిమ ప్రభావమును కిరీటముగా - ధరింపజేసితివి.
శాశ్వత కాలము వరకు నీ సంగతిపై దృష్టి నిలిపి 
నీ దాసుల ప్రార్ధనలు సఫలపరచితివ

నీనిత్యమైన ఆదరణ చూపి నను స్థిరపరచుటకు
నీ కరుణకటాక్షమును నాపై కురిపించి నను ప్రేమించితివి
నాకు ప్రయోజనము కలుగజేయుటకు నీ ఉపదేశమును బోధించి
నీ దాసుని ప్రాణమును సంతోషపరచితివి

ఆనందకరమైన దేశములో నేను నిను ఘనపరచుటకు
నీ మహిమాత్మతో నింపి సురక్షితముగా నన్ను నివసింపజేసితివి
మేఘవాహనుడవై వచ్చువరకు నే కనిపెట్టుచుందును నీ కోసము
నీ దాసులా కాంక్షను సంపూర్ణ పరచెదవు 

Siramu mida mulla sakshiga karchina kannila sakshiga శిరము మీద ముళ్ల సాక్షిగా కార్చిన కన్నీళ్ళ సాక్షిగా

శిరము మీద ముళ్ల సాక్షిగా
కార్చిన కన్నీళ్ళ సాక్షిగా        " 2 "
పొందిన గాయాల సాక్షిగా
చిందిన రుధిరంబు సాక్షిగా   " 2 "
యేసు నిన్ను పిలచుచున్నాడు
నీ కొరకే నిలచియున్నాడు    " 3 "
సర్వపాప పరిహారం కోసం
రక్త ప్రోక్షణం అవశ్యమని         " 2 "
మనుషులలో ఎవ్వరు బలికి పనికి రారని
పరమాత్ముడే బలియై తిరిగిలేవాలని
ఆర్య ఋషులు పలికిన ఆ....వేద సత్యం
యేసులోనే నెరవేరెనుగా
సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణ మవశ్యం
తద్ రక్తం పరమాత్మేనాం
పుణ్యదాన బలియాగం
ఆర్య ఋషులు పలికిన ఆ....వేద సత్యం
క్రీస్తులో........నే నెరవేరెనుగా
యేసే బలియైన పరమాత్మ   " శిరము "

మహా దేవుడే ఇలకేతెంచి
యజ్ఞ పశువుగా వధ పొందాలని  " 2 "
కాళ్ళలోన చేతులలో 3 మేకులుండాలని
శిరముపైన 7 ముళ్ళ గాయాలు పొందాలని
బ్రహ్మణాలు పలికిన ఆ.....వేద సత్యం
క్రీస్తులో.......నే నెరవేరెనుగా
*చత్వారి శ్రుగ్నత్రయో అస్యపాద ద్యే
శీర్షే సప్త హస్తాసో !
అస్య త్రిధా బద్ధో వృషభో రోరవీతి*
మహో దేవో మర్త్యాం ఆవివేశ ఇథి!!
బ్రహ్మణాలు పలికిన దేవోక్తి
యేసులో......నే నెరవేరెనుగా
యేసే మరణించి లేచిన యజ్ఞ పురుషుడుగా
   

Samvastharamulu veluchundaga nithyamu nee krupatho సంవత్సరములు వెలుచుండగా నిత్యము నీకృపతో ఉంచితివా

సంవత్సరములు వెలుచుండగా
నిత్యము నీకృపతో ఉంచితివా
దినములన్ని తరుగుచుండగా
నీ దయతో నన్ను కాచితివా
నీకే వందనం నను ప్రేమించిన యేసయ్య
నీకేస్తోత్రము నను రక్షించిన యేసయ్య "2"
గడచిన కాలమంతా నీ
చల్లని నీడలో నడిపించినావు
నే చేసిన పాపమంతా
కలువరి సిలువలో మోసినావు " 2 "
శత్రువుల నుండి విడిపించినావు
సంవత్సరమంతా కాపాడినావు " 2 "
                           "  నీకే వందనం  "
బ్రతుకు దినములన్నీ
ఏలీయా వలే  నన్ను పోషించినావు
పాతవి గతియింపజేసి
నూతన వస్త్రములు దరియింపజేసావు " 2 "
నూతన క్రియలతో నను నింపినావు
సరికొత్త తైళముతో నను అంటినావు " 2 "
                            "  నీకే వందనం  "

Tharatharamulu unnavadavu yugayugamulu yeluvadavu తరతరములు ఉన్నవాడవు యుగయుగములు ఏలువాడవు

తరతరములు ఉన్నవాడవు.............
యుగయుగములు ఏలువాడవు..... " 2 "
నీవే రాజువు నీవే దేవుడవు  " 2 "
జగాలను యేలే జయశీలుడవు నీవు
జనసైన్యములను నడిపే
విజయశీలుడవు నీవు     " 2 "
ఎన్ని తరాలు మారినా
ఎన్ని యుగాలు గడచినా  " 2 "
నీవే నీవే నీవే రారాజువు    "తరతరములు"
భూమికి నీవే పునాదులు వేసినవాడవు
నీరాజ్య స్థాపనకై ఈసృష్టినే కలుగజేశావు "2"
సృష్టికర్తవు నీవే శాంతిదాతవు నీవే " 2 "
నీవే నీవే నీవే మారాజువు *"తరతరములు"
            

Nuthana jeevithalu okatayye ee vela sandhaditho నూతన జీవితాలు ఒకటయ్యే ఈవేళ సందడితో సంతోషాలతో

నూతన జీవితాలు ఒకటయ్యే ఈవేళ
సందడితో సంతోషాలతో
మైమరచే ఈశుభవేళ       " 2 "
యేసయ్య దిగివచ్చేగా
దీవెనలు కురిపించగా
దీవించి ఆశీర్వదించి కలిపేను ఒక జంటగా
ఒకరికి ఒకరు అండగా ఉంటూ
ఆత్మీయ మేలులతో జీవితం కొనసాగుతూ "2"
దేవునికి దగ్గరగా లోకులకు దూరంగా " 2 "
దేవుని సన్నిధిలో కలకాలం ఉండాలిక " 2 "
                                "నూతన"
ఆశీర్వాదముతో అడుగులు వేస్తూ
దేవుని దీవెనలు నిత్యము పొందుతూ " 2 "
కష్టాలలో దేవుని మరువక                  " 2 "
బాధలలో తన చేయి విడువక            " 2 "
                                     "నూతన"
దేవుడు ఎన్నడూ మిమ్మును విడువడు
బుద్ధిని జ్ఞానమును సంపద మీకిచ్చును" 2 "
దేవుని యందు భయభక్తులు కలిగి       " 2 "
ఉండాలి మీరిక బ్రతకాలి జాగ్రత్తగా       " 2 "
                                      "నూతన"

Yesayya nijamaina devudani ninne nammi yunnanu యేసయ్య నిజమైన దేవుడవని నిన్నే నమ్మియున్నాను

యేసయ్య నిజమైన దేవుడవని
నిన్నే నమ్మియున్నాను
ఈ లోకానికి ఈ జీవానికి
నిన్నే ప్రకటిస్తున్నాను    " 2 "
రాజులకు రాజువని
ప్రభువులకు ప్రభువువని
రత్నాల వర్ణుడవని అతికాంక్షనీయుడవని
ఉంటావులే ప్రభువా
అపత్కాలములో నాతోడుగా
చేస్తావులే ప్రభువా
అద్భుతకార్యాలెన్నో ప్రేమగా
నీలాంటి దేవుడు నాకుండగా
నాకు భయమన్నదే లేదే
నీలాంటి దేవుడు నాకుండగా
నాకు దిగులన్నదే రాదే
ఉంటావులే నాతో ఎన్నడూ              }
విడువనంటావులే యుగయుగాలకు } " 2 "
ఆది అంతం నీవే దేవా       "  యేసయ్య  "
వస్తావులే ప్రభువా కష్ట కాలంలో నాఅండగా
దీవిస్తావులే ప్రభువా
ఆశీర్వాదాలతో మెండుగా
రాజువు అయిన రక్షకుడవు అయిన
ఈ లోకానికి నీవేలే
దీనులను దారిద్రులను
లేవనెత్తువాడవు నీవేలే
వస్తావులే ఈ లోకానికి      }
చేరుస్తావులే పరలోకానికి  } " 2 "
నాతల్లియు తండ్రియు నీవేదేవా "యేసయ్య"
       

Maranimchi lechithivi nannethagano preminchi nee మరణించి లేచితివి నన్నెంతో ప్రేమించి


Song no:

మరణించి లేచితివి
నన్నెంతో ప్రేమించి నీకృపలో దాచితివి "2"
సిలువలో మృతిపొంది....................

నా సజీవుడు నా యేసు
నన్ను వెదకు చుండెను.                   " 2 "
నా దోషములు కడిగెను
నన్ను పవిత్రునిగా మార్చెను.            " 2 "
హల్లెలూయా హల్లెలూయా*
హల్లెలూయా హల్లెలూయా.           " 2 "
                                         "  సిలువలో  "

సమాధిలో లాజరును పిలిచే
మృతిలోనుండి                               " 2 "
జీవమిచ్చును లాజరుకు
ఆ జీవమే నికిచ్చచెను.                   " 2 "
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా.           " 2 "
                                         "  సిలువలో  "

నా రక్షకుడు నా యేసు
నన్ను ప్రేమించు చుండెను.             " 2 "
నా పాపముల్ క్షమియించును
తన రాజ్యములో చేర్చును          " 2 "
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా.           " 2 "
                                         "  సిలువలో  "

Siluva mranupai vrelade ee ghora papikai సిలువ మ్రానుపై వ్రేలాడే ఈ ఘోర పాపికై రక్తము కార్చే


Song no:

సిలువ మ్రానుపై వ్రేలాడే
ఈ ఘోర పాపికై రక్తము కార్చే  " 2 "
నాయేసయ్య.......నా యేసయ్య.......
నాయేసయ్య....... నాయేసయ్య........

నాపాప సంకెళ్లలో చిక్కుకున్న నీదేహము
నను విడుదల చేయుటకై
నీవు చేసిన ఈ యాగము      " 2 "
భరయించితివా సహించితివా
ఈ పాపికై  బలియైతివా      " 2 "
ఈ పాపికై  బలియైతివా     "  సిలువ "

ఏ పాపమెరుగని నిన్ను
హింసించినా ఈలోకము
ఏనేరమెరుగని నిన్ను శిక్షించిన ఆసైన్యము"2"
క్షమియించితివా రక్షించితివా
నాపై నీప్రేమ చూపితివా      " 2 "
నాపై నీప్రేమ చూపితివా      " సిలువ  "

Anudhinamu prabhuni stuthiyinchedhamu anukshanamu అనుదినము ప్రభుని స్తుతియించెదము


Song no:

అనుదినము ప్రభుని
స్తుతియించెదము
అనుక్షణము ప్రభుని
అనంత ప్రేమను "2"
అల్లుకుపోయేది-ఆర్పజాలనిది
అలుపెరుగనిది ప్రభు ప్రేమ "2"
                        "అనుదినము"
1.ప్రతిపాపమును-పరిహరించి
శాశ్వతప్రేమతో-క్షమియించునది
నా అడుగులను-సుస్థిరపరచి
ఉన్నతస్థలమున-నింపునది "2"
అల్లుకుపోయేది-ఆర్పజాలనిది
అలుపెరుగనిది ప్రభు ప్రేమ "2"
                        "అనుదినము"
2.ప్రతిరేపటిలో-తోడైనిలిచి
సిలువనీడలో-బ్రతికించినది
స్వర్గద్వారము-చేరువరకు
మాకు ఆశ్రయమిచ్చునది "2"
అల్లుకుపోయేది-ఆర్పజాలనిది అలుపెరుగనిది ప్రభు ప్రేమ "2"
                        "అనుదినము"

Yentha premayya naa yesayya ee papi paina ఎంత ప్రేమయ్యా నా యేసయ్య ఈ పాపి పైన నా యేసయ్య


Song no:

||పల్లవి ||   
      
ఎంత ప్రేమయ్యా నా యేసయ్య
ఈ పాపి పైన నా యేసయ్య
మరపురాని నీ ప్రేమ మరువలేనయ్య
ఏమిచ్చి నీ ఋణం తీర్చగలనేసయ్య


చరణం ౧
ఎంతో భారమైన నా పాపాన్ని , మోసావు నీవు కల్వరి కొండపైకి
దుషింపబడినావు... ఉమ్మివేయబడినావు
కేవలము నా కొరకు నిందితుడివైనావు


చరణం ౨
రక్తం అంతా కార్చి దేహం అంతా చిలినా, విధేయత చూపించి మరణించితివా
తండ్రి విడచినా.. నీవు విడువనేలేదయ్య   
కేవలము నా కొరకు నడి మధ్యలో వ్రేలాడి

Yesayya prema yentho madhuram papini karuninchu prema యేసయ్య ప్రేమ ఎంతో మంధురం పాపిని కరుణించు ప్రేమ


Song no:

యేసయ్య ప్రేమ ఎంతో మంధురం
పాపిని కరుణించు ప్రేమ "2"
తనప్రాణమునిచ్చి కాపాడునులే
తనర్రెక్కలక్రింద దాచ్చునులే "2"
                   "యేసయ్య"
1.ఒంటరినై నేను ఉన్నపుడు
జంటగ నిలిచ్చేను ఆప్రేమ
ఆదరణే లేక ఉన్నపుడు
ఆదరించేను ఆప్రేమ "2"
యవరు లేరని ఎడ్చినప్పడు
నేనునాననే ఆప్రేమ "2"
కరుణించేను నను
కృపచూపేను నాకు
కరుణా మయుడు నాయేసయ్య "2"
                      "యేసయ్య"
2.కష్టలలో కుమిలి ఉన్నప్పడు
కడతేర్చేను నను ఆప్రేమ
కన్నీటీ గాదలో ఉన్నప్పడు
కన్నీరు తుడచేను ఆప్రేమ "2"
కలవరపడి నేవున్నప్పడు
కన్నీకరించేను ఆప్రేమ "2"
కలతలు భాపి-కరములుచ్చాపి
తనకౌగిట నన్ను దాచ్చేనుగా "2"
                   " యేసయ్య "

Dhivyamaina nee prematho dhulinaina nannu preminchu దివ్యమైన నీ ప్రేమతో దూళినైనా నన్ను ప్రేమించు చుంటివి


Song no:

దివ్యమైన నీ ప్రేమతో దూళినైనా నన్ను ప్రేమించు చుంటివి
యేసయ్య మిన్నల్లినైనా నన్నూ మరువలేదయ్యా
యేసయ్య నీకన్నా నాకు ఇలలో ఎవరు లేరయ్యా } 2 || దివ్యమైన ||

రోగినైనా నేను రోధించుచుండగా
మరణమే నా ముందు నీలిచియుండగా  } 2
వైద్యులకే వైద్యుడా నేను నిన్ను వేడగా
మరణ పడక నుండి నన్ను లేపినవయ్యా
యేసయ్య మిన్నల్లినైనా నన్నూ మరువలేదయ్యా
యేసయ్య నీకన్నా నాకు ఇలలో ఎవరు లేరయ్యా } 2 |
దివ్యమైన నీ ప్రేమతో దూళినైనా నన్ను ప్రేమించు చుంటివి

శత్రువే నన్ను చూచి నవ్వుచుండగా
కింద పడిపోతినని అతిశయించగా  } 2
రాజులకే రాజా నేను నిన్ను పిలువగా } 2
శత్రువును ఓడించి జయమునిచ్చి నావయ్యా } 2
యేసయ్య మిన్నల్లినైనా నన్నూ మరువలేదయ్యా
యేసయ్య నీకన్నా నాకు ఇలలో ఎవరు లేరయ్యా } 2 |
దివ్యమైన నీ ప్రేమతో దూళినైనా నన్ను ప్రేమించు చుంటివి

నీవు ఉన్నావు గనుక బ్రతుకు చుంటిని
మనసారా నిన్ను నేను హత్తుకుంటిని } 2
నా ప్రియా నేస్తమా నీతోనే చెలిమి చేసి
కడవరకు నేను నిన్ను వెంబడింతునయ్యా
యేసయ్య మిన్నల్లినైనా నన్నూ మరువలేదయ్యా
యేసయ్య నీకన్నా నాకు ఇలలో ఎవరు లేరయ్యా } 2 |
దివ్యమైన నీ ప్రేమతో దూళినైనా నన్ను ప్రేమించు చుంటివి



Neelo nenunna neetho jeevisthunna asrayame asrayame neevu naku నీలో నేనున్నా నీలో జీవిస్తున్నఆశ్చర్యమే ఆశ్చర్యమే


Song no:

నీలో నేనున్నా నీలో  జీవిస్తున్న

ఆశ్చర్యమే ఆశ్చర్యమే నీవు నాకు ఆశ్చర్యమే
అద్భుతమే అద్భుతమే నీదు శక్తి అద్భుతమే } 2

విడుదలనిచ్చేది నీ నామమే
స్వస్థత నిచ్చేది  నీ నామమే }2
నా పార్ధన వినువాడవే
నా రోదన కనువాడవే }2
నా వేదనలన్నీ కనుమరుగయే

నా గతిని స్థాపించే నా  యేసయ్య
నా స్థితిని సవరించే నా  యేసయ్య
నీ మార్గములో నే సాగగా
నీ  చిత్తములో నేనుండగా } 2
నా జీవితం ధన్యమయే




Neeku sati yevaru leru yesayya ielalo neeve yekaika devudavu నీకు సాటి ఎవరు లేరు యేసయ్యా ఇలలో నీవే ఏకైక దేవుడవు


Song no:

నీకు సాటి ఎవరు లేరు (యేసయ్యా)

ఇలలో నీవే ఏకైక దేవుడవు (2)

ఆత్మతో సత్యముతో ఆరాధింతును

నీదు క్రియలు కొనియాడెదను (2)

అత్యున్నతుడా నా యేసయ్యా

నీవే నాకు నిజ రక్షకుడవు (2)         ||నీకు||

పరమందు దూతలు నిను పొగడుచుందురు

నీవే ప్రభువుల ప్రభువని (2)

నీ ఘన కీర్తిని వివరించగలనా

నా ప్రియుడా నా యేసయ్యా (2)        ||అత్యున్నతుడా||

ఆకాశమనాడు ఆసీనుడైనవాడా

నీ తట్టు కన్నులెత్తుచున్నాను (2)

ఊహించువాటి కంటే అత్యధికముగా

దయచేయువాడవు నీకే స్తోత్రం (2)        ||అత్యున్నతుడా||



Neeku Saati Evaru Leru (Yesayyaa)

Ilalo Neeve Ekaika Devudavu (2)

Aathmatho Sathyamutho Aaraadhinthunu

Needu Kriyalu Koniyaadedanu (2)

Athyunnathudaa Naa Yesayyaa

Neeve Naaku Nija Rakshakudavu (2)         ||Neeku||

Paramandu Doothalu Ninu Pogaduchunduru

Neeve Prabhuvula Prabhuvani (2)

Nee Ghana Keerthini Vivarinchagalanaa

Naa Priyudaa Naa Yesayyaa (2)        ||Athyunnathudaa||

Aakaashmanadu Aaseenudainavaadaa

Nee Thattu Kannuletthuchunnaanu (2)

Oohinchuvaati Kante Athyadhikamugaa

Dayacheyuvaadavu Neeke Sthothram (2)        ||Athyunnathudaa||

Chirakala snehithuda naa hrudhayana sannihithuda చిరకాల స్నేహితుడా _ నా హృదయాల సన్నిహితుడా


Song no:


చిరకాల స్నేహితుడా _ నా హృదయాల  సన్నిహితుడా
నా తోడు నీవయ్యా _ నీ స్నేహం చాలయ్య
నా నీడ నీవయ్యా  _ ప్రియ ప్రభువా యేసయ్యా
చిర కాల స్నేహం _ ఇది నా యేసు స్నేహం


బందువులు వెలి వేసిన _ వెలివేయని స్నేహం
లోకాన లేనట్టి ఆ దివ్య స్నేహం _ నా యేసుని స్నేహం
చిరకాల స్నేహం ఇది నాయేసు స్నేహం //2/


కష్టాలలో కన్నీలలో _ నను మోయు నీ స్నేహం
నను  దైర్య పరచి అదరణ కలిగించు నా యేసుని స్నేహం
చిరకాల స్నేహం ఇది నాయేసు స్నేహం //2/


నిజమైనది విడువనిది ప్రేమమించు  నీ స్నేహం
కలువరిలో చూపిన ఆ సిలువ స్నేహం
నా యేసుని స్నేహం
చిరకాల స్నేహం ఇది నాయేసు స్నేహం //2/

Anandhame paramanandhame yesayya sannidhilo ఆనందమే పరమానందమే యేసయ్య సన్నిధిలో


Song no:

ఆనందమే పరమానందమే యేసయ్య సన్నిధిలో
ఆనందమే పరమానందమే యేసయ్య సముఖములో)/2/

​(దేవా వందనం మా దేవా వందనం
స్తుతి వందనం మా రాజా వందనం) /2/

హల్లెలూయా హల్లెలూయా..హల్లెలూయా ​హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ /2/ఆనందమే/

​1. స్వామీ మా హృదయ ఫలకం మీద నీ సత్య మార్గాన్ని ముద్రించుమా /2/
మేమెన్నడు దానిని మరువక కుడిఎడమకైనను తిరుగక /2/
నడిపింపజేయుమయ్యా ​… నడిపింపజేయుమయ్యా ​… /2/
హల్లెలూయా హల్లెలూయా..హల్లెలూయా ​హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ /2/ఆనందమే/

​2. ​స్వామీ నీ ఆత్మ ప్రేరణతో మానోట నీమాట పలికించుమా /2/
అనునిత్యము నిన్ను స్తుతించుచు నీ మధుర గానాలు ఆలపించుచు /2/
జీవింపజేయుమయ్యా … జీవింపజేయుమయ్యా… /2/
హల్లెలూయా హల్లెలూయా..హల్లెలూయా ​హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ /2/ఆనందమే/

3. స్వామీ మేము నీ చిత్తమెరిగి నీపనిని వేగముగ జరిగించుచు /2/
నీగొప్ప ఆజ్ఞలు పాటించుచు – నిరాటంకముగా ప్రకటించుచు /2/
పయనింపజేయుమయ్యా … పయనింపజేయుమయ్యా … /2/
హల్లెలూయా హల్లెలూయా..హల్లెలూయా ​హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ /2/ఆనందమే/

Abrahamu devudavu essaku devudavu yakobu devudavu అబ్రాహాము దేవుడవు ఇస్సాకు దేవుడవు

Song no: 69

అబ్రాహాము దేవుడవు ఇస్సాకు దేవుడవు
యాకోబు దేవుడవు నాకు చాలినదేవుడవు
యేసయ్య నా యేసయ్య  యేసయ్య నా యేసయ్య

1. అబ్రాహాము విశ్వాసముతో స్వదేశము విడిచెను   
పునాదుల గల పట్టణము కై వేచి జీవించెను   
అబ్రాహాముకు చాలిన దేవుడా నీవైన్నయ్య
యేసయ్య నా యేసయ్య  యేసయ్య నా యేసయ్య

2. ఇస్సాకు విధేయుడై బలీయగమాయెను   
వాగ్దానాన్ని బట్టి మృతుడై లేచెను   
ఇస్సాకు చాలిన దేవుడా నీవైన్నయ్య
యేసయ్య నా యేసయ్య  యేసయ్య నా యేసయ్య

3.  యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచెను   
యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను   
యాకోబుకు చాలిన దేవుడా నీవైన్నయ్య
యేసయ్య నా యేసయ్య  యేసయ్య నా యేసయ్య

Abrahamu devudavu essaku devudavu yakobu devudavu rajula raja అబ్రాహము దేవుడవు ఇస్సాకు దేవుడవు యాకోబు దేవుడవు రాజుల రాజా


Song no:

అబ్రాహము దేవుడవు ఇస్సాకు దేవుడవు

యాకోబు దేవుడవు రాజుల రాజా

యావే నిన్ను స్తుతియింతును

యావే నిన్ను ఘనపరతును

హల్లెలూయా హల్లెలూయా హోసన్నా



నీవే నీవే నా మార్గము నీవే నీవే నా సత్యము

నీవే నీవే నా జీవము నీవే నీవే నా రక్షణ

నీవే నీవే నా నిరీక్షణ నీవే నీవే నా సంగీతము

నీవే నీవే నా సంతోషము నీవే నీవే నా బలము



నీవే నీవే నా ఖడ్గము నీవే నీవే నా కిరీటము

నీవే నీవే నా కవచం నీవే నీవే నా కేడెము

నీవే నీవే నా కోట నీవే నీవే నా ఆశ్రయం

నీవే నీవే నా శృంగము నీవే నీవే నా సంపద

Adagaka munupe naa akkaralanniyu yerigina vadavu అడగక మునుపే నా అక్కరలన్నియు ఎరిగిన వాడవు

Song no: 153

అడగక మునుపే నా అక్కరలన్నియు ఎరిగిన వాడవు
అడిగిన వాటికింటే అత్యధికముగా చేయుచున్నావు
యేసయ్య నీ కృప పొందుటకు నాలో ఏమున్నదని?

1  నాకు సహాయము చేయుటకై - నీ దక్షిణ హస్తము చాపితివే
సత్య సాక్షిగా నేనుండుటకై - ఉపకరములెన్నో చేసితివే
హల్లెలూయ  - ఉపకరములెన్నో చేసితివే ||అడగక||

2  నాకు దీర్గాయువునిచ్చుటకే - నీ హితోపదేశము పంపితివే
నిత్యజీవము నేపొందుటకు - పునరుత్థానము నొందితివే
హల్లెలూయ - పునరుత్థానము నొందితివే ||అడగక||

3   నాకు ఐశ్వర్యమునిచ్చుటకే  - నీ మహిమైశ్వర్యము విడిచితివే
మహిమలో నీతో నేనుండుటకే - మహిమాత్మతో నన్ను నింపితివే
హల్లెలూయ - మహిమాత్మతో నన్ను నింపితివే ||అడగక|| 

Naa prana priyudavu naa prana nadhudavu నా ప్రాణ ప్రియుడవు నా ప్రాణ నాదుడవు


Song no:

నా ప్రాణ ప్రియుడవు
నా ప్రాణ నాదుడవు
నా ప్రాణ దాతవు యేసయ్య
ప్రాణ ప్రదముగ ప్రేమించినావు
ప్రాణము సిలువలో అర్పించినావు
ఆరాధన స్తుతి అరాధన
ఆరాధన నీకె అరాధన "2"
     1
అదములలో ప్రదముడను
ప్రభువా నీ కృపకు పాత్రుడ కాను "2"
అయినా నన్ను ప్రేమించినావు
ప్రియముగ నాతో మట్లాడినావు "2"
            (ఆరాధన)
     2
అందరిలో అల్పడను
అందరు ఉన్న అనాదను "2"
అయినా నీ కృప నాపై చూపి
అప్తుడవై నను ఆదుకొంటివే "2"
                (ఆరాధన)

Kavalena yesayya bhahumanamu cheyali కావలెనా యేసయ్య భహుమానము} చేయాలి విలువైన ఉపవాసము


Song no:

కావలెనా యేసయ్య భహుమానము}
చేయాలి విలువైన ఉపవాసము       }॥2॥
మరి సిద్దమవు శ్రీయేసుని ప్రియసంఘమా}       
చిగురించాలి అంజూరపు చెట్టు కొమ్మలా  }॥2॥
                                          ॥కావలెనా॥
             1॰     
నినివే పట్టణము
యెహోవా దృష్టికి ఘోరమాయెను
పాపముతో నిండిపోయెను
సృష్టికర్త యెహోవా యోనాను దర్శించి
నినివే పంపెను
కనికరము చూపించెను
ఘనులేమి అల్పులేమి
నీనెవె దేశపు రాజేమి
పిల్లలేమి పెద్దలేమి ఉపవాసముచేయగా
ఆగింది యెహోవా శాపము }
కురిసింది కరుణావర్షము    }॥2॥                     
                                          ॥కావలెనా॥
            2॰
దేవుని ప్రజలను నశియింపజేయుటకు
దుష్టుడు తలంచెను
కలవరము పుట్టించెను                       
మోర్దుకై వేదనతో
రాజునొద్దకు పంపుట దైవచిత్తమని
ఎస్తేరును సిద్ధపరచెను                   
ఘనులేమి అల్పులేమి
షూషను కోటలో రాణియేమి
పిల్లలేమి పెద్దలేమి ఉపవాసముచేయగా
అణిగింది హామాను గర్వము  }
జరిగింది దేవుని చిత్తము       }॥2॥
                                           ॥కావలెనా॥

Ayya dhaveedhu thanaya hosanna yudhula raja yesanna అయ్య దావీదుతనయా హోసన్న యూదుల రాజా యేసన్న

Song no:
    హోసన్నా…
    హోసన్నా హోసన్నా హోసన్నా } 3
    అయ్యా.. దావీదు తనయా హోసన్నా
    యూదుల రాజా యేసన్నా } 2
    హోసన్నా హోసన్నా – యేసన్నా యేసన్నా || దావీదు ||

  1. గిరులు తరులు సాగరులు
    నీకై వీచెను వింధ్యామరలు
    హోసన్నా హోసన్నా – యేసన్నా యేసన్నా
    గిరులు తరులు సాగరులు
    నీకై వీచెను వింధ్యామరలు
    పిల్లలు పెద్దలు జగమంతా } 2
    నీకై వేచెను బ్రతుకంతా || దావీదు ||

  2. కరుణా రసమయ నీ నయనాలు
    సమతా మమతల సంకేతాలు
    హోసన్నా హోసన్నా – యేసన్నా యేసన్నా
    కరుణా రసమయ నీ నయనాలు
    సమతా మమతల సంకేతాలు
    కంచర వాహన నీ పయనాలు } 2
    జనావాహినికే సుబోధకాలు || దావీదు ||

  3. పేదల పాలిటి పెన్నిధివై
    పాపుల రక్షకుడైనావు
    హోసన్నా హోసన్నా – యేసన్నా యేసన్నా
    పేదల పాలిటి పెన్నిధివై
    పాపుల రక్షకుడైనావు
    మకుటము లేని ఓ మహరాజా } 2
    పరిచితిమివిగో మా హృదయాలు || దావీదు ||




Song no:
    Hosannaa…
    Hosannaa Hosannaa Hosannaa } 3
    Ayya.. Daaveedu Thanayaa Hosannaa
    Yoodhula Raajaa Yesannaa } 2
    Hosannaa Hosannaa – Yesannaa Yesannaa || Daaveedu ||

  1. Girulu Tharulu Saagarulu
    Neekai Veechenu Vindhyaamaralu
    Hosannaa Hosannaa – Yesannaa Yesannaa
    Girulu Tharulu Saagarulu
    Neekai Veechenu Vindhyaamaralu
    Pillalu Peddalu Jagamanthaa } 2
    Neekai Vechenu Brathukanthaa || Daaveedu ||

  2. Karunaa Rasamaya Nee Nayanaalu
    Samathaa Mamathala Sankethaalu
    Hosannaa Hosannaa – Yesannaa Yesannaa
    Karunaa Rasamaya Nee Nayanaalu
    Samathaa Mamathala Sankethaalu
    Kanchara Vaahana Nee Payanaalu } 2
    Janavaahinike Subodhakaalu || Daaveedu ||

  3. Pedhala Paaliti Pennidhivai
    Paapula Rakshakudainaavu
    Hosannaa Hosannaa – Yesannaa Yesannaa
    Pedhala Paaliti Pennidhivai
    Paapula Rakshakudainaavu
    Makutamu Leni O Maharaajaa } 2
    Parichithimivigo Maa Hrudayaalu || Daaveedu ||




Mohodhayam shubhodhayam sarvalokani మహోదయం శుభోదయం సర్వలోకాని కరుణోదయం

మహోదయం  శుభోదయం  సర్వలోకాని కరుణోదయం
శ్రీయేసు రాజు జన్మ దినం  భూప్రజలెల్లరి హృదయానందం
సర్వలోకాన సువార్త తెల్ప భువికేతించిన మరియ పుత్రుడు
క్రుపామయుడు సత్య సంపూర్ణుడు  క్రీస్తేసు రాజు జన్మదినం
ఆ హల్లేలుయా ఆ హల్లేలుయా ఆ హల్లేలుయా ఆ హల్లేలుయా (2)
ఘోర పాపములోనున్న జనులకు పరలోక జీవ మార్గము చూప
కరుణామయుడు ఇమ్మానుయేలు అవతరించిన శుభోదయం
ఆ హల్లేలుయా ఆ హల్లేలుయా ఆ హల్లేలుయా ఆ హల్లేలుయా (2)

Mahimantha vadhulukoni thana rupam marchukoni మహిమంతా వదులుకొని - తన రూపం మార్చుకొని

మహిమంతా వదులుకొని - తన రూపం మార్చుకొని
యేసు భువికొచ్చాడని
ఊరంతా సందడి - వాడంతా సందడి - ఊరు వాడ సందడి
మంచిలేని లోకంలో మంచిని స్థాపించడానికి
మేలెట్లా చెయ్యాలో చేసి చూపడానికి
కీడును తొలగించడానికి
పాపమేమిలేనివాడు ఇలలో పుట్టాడని
నింగిలో సందడి - నేలపై సందడి
నింగీ నేలా సందడి
శాంతిలేని లోకంలో శాంతిని దయచేయడానికి
సత్యాన్ని గురించి సాక్ష్యమివ్వడానికి
స్వర్గానికి చేర్చడానికి
శాంతిదాతయైనవాడు ఇలలో పుట్టాడని
ఇంటింటా సందడి - బయటంతా సందడి
ఇంటా బయటా సందడి
కాంతిలేని లోకంలో జ్యోతిని వెలిగించడానికి
దేవుడుగా పరిచయం చేసుకోవడానికి
ప్రత్యక్షత ఇవ్వడానికి
నీతి సూర్యుడైనవాడు ఇలలో పుట్టాడని
కోటలో సందడి పేటలో సందడి
కోటా పేటా సందడి

Mariya thanayudata manuja rupudata మరియ తనయుడట మనుజ రూపుడట

మరియ తనయుడట మనుజ రూపుడట
మాన వాళి నిజదేవుడట
ఇది మరి తలచిన మరువక కొలచిన
మానవాళి నిజ దేవుడట
దావీదు అను పట్టణమునకు
పరుగు పరుగునా పొదామా (2)
పొత్తి గుడ్డలట చిన్ని తొట్టెలట
పశుల పాకలో పుట్టెనట (2)

Deva sthothra ganamul pai dhivya sthalamulo దేవస్తోత్ర గానముల్ ఫై దివ్య స్టలములో

Song no: 20
క్రిస్మస్ ప్రవచనముల నెరవేర్పు

    దేవస్తొత్రగానముల్ పై - దివ్యస్థలములో - దేవమారుగానముల్ భూ - దేశస్థలములో - దేవలోకపావనులను - దీన నరులను బోవజూడ భువి దివి క్రిస్మస్

  1. అవ్వకిచ్చినట్టి వాక్కు - అదిగో తొట్టిలో పవ్వళించి యున్న దేవ బాలయేసులో = ఇవ్విధముగ సఫలమాయే - ఈదినంబున నవ్వుమోము - నరుని కబ్బెను || దేవ ||

  2. షేము దేవ వందనంబు - చెప్పబడియెను భూమి స్తుతుల నందు కొనెడి - పూజనీయుడు = భూమిపైన నరుడుగాను - బుట్టవచ్చెను భూమి క్రిస్మస్ - బోగమొందెను || దేవ ||

  3. అందరి వంశంబులు నీ - యందుదేవెన - బొందునంచు నబ్రామునకు నందెనువాక్కు = అందెక్రీస్తు యూదులకును అన్యజనులకున్ విందుక్రిస్మస్ - విశ్వమంతటన్ || దేవ ||

  4. షీలో వచ్చువరకు యూదాలో నిలుచుచు - నేలురాజు దండ ముండు నెపుడు తొలగదు = నేలమీద నిత్యశాంతి పాలనజేయ పాలకుండౌ - బాలుడు - జన్మించెన్ || దేవ ||

  5. అక్షయమగు చుక్కయొకటి - యాకోబులో - లక్షణముగ బుట్ట వలయునుధాత్రిపై - రక్షణార్ధులే సదా ని - రీక్షించెడు నక్షత్రం బగు రక్షకుడుదయించె || దేవ ||

  6. పుట్టవలయు మోషేవంటి - పూర్ణ ప్రవక్త - ఎట్టివారలైన నెరుగ నట్టి ధర్మముల్ - దిట్టముగను స్థాపింప దేవపుత్రుడు - పుట్టెన్ గొప్ప - బోధకుడాయెను || దేవ ||

  7. మరియ పుత్ర నామ - మిమ్మానుయేలగున్ - నరులకు దేవుండెతోడు నిరతమువరకున్ - దరినిదేవుడుండుగాన - వెరవమెన్నడున్ పరమ దేవుని సహవాసము లభించున్ || దేవ ||

  8. మననిమిత్తమైన శిశువు - మహిని బుట్టెను - చనువుగ దరిజేర శిశువు - స్వామియాయెను = తనువు రక్షణను గణింప - వెనుకదేయదు వినయభూషణులకు - వేళవచ్చెను || దేవ ||

  9. మొలకలెత్తవలె యెషయి - మొద్దునందున - ఫలములేని మోడు నరుల - వంశవృక్షము = విలువగలుగు నిత్యజీవ - ఫలములిడుటకై కళగల జన్మార్ధకరుడు వచ్చెను || దేవ ||

  10. కలులు చీకటిన్ నడుచుచు - వెలుగుచూచిరి పలువిధంబులైన యట్టి పాపచీకటుల్ = తొలగజేసి శుద్ధకాంతి - కలుగజేయును - వెలుగుగా దేవుడు - వెలసె ధాత్రిలో || దేవ ||

  11. అల్పమైన బెత్లెహేము - నందున క్రీస్తు నిల్పవలెను తనదు జన్మ - నిజచరిత్రను = అల్పులందు సైతమల్పమైనయూళ్ళలో స్వల్పరక్షస్థాపకుడై వచ్చె || దేవ ||

  12. ఆడితప్పనట్టిదేవ - అనంతస్తొత్రముల్ - నాడు పల్కువాగ్ధానముల నన్నిటిన్ = నేడు నెరవేర్చినావు నీ సుతునంపి కీడుల్ బాపు క్రిస్మసుగల్గె || దేవ ||

  13. నీ నిజవాగ్ధత్తములను - నిత్యము నమ్మి - వాని నెరవేర్పులు విని - వట్టివి యనక = మానసమున ననుభవించు - మనసు - నీయుమని - దానమూల్య - జ్ఞానమొసగుమీ || దేవ ||

  14. గగనమందు క్రిస్మసుండు - గానకీర్తులౌ - జగతియందు క్రిస్మసుండు స్థవముగల్గుత = యుగయుగములవరకు త్రైకు - డొందు ప్రణుతులు సొగసుగ బరిగెడు - చోద్యగీతముల్ || దేవ ||  

  15. దేవస్తోత్ర గానముల్ ఫైదివ్య స్టలములో
    దేవమారు గానముల్ భూదేశ స్టలములో
    దేవలోక పావనులను దీన నరులను –బ్రోవ జూడ భువి దివి క్రిస్మస్
    అవ్వకిచ్చినట్టి వాక్కు అదిగో తొట్టిలో - పవ్వలించియున్న దేవా
    బాలయేసులో – ఇవ్విధముగా సఫలమాయే ఈ దినంబున
    నవ్వ మోము నరునికబ్బెను(దేవ)
    షేముదేవ వందనంబు చెప్పబడియెను -
    భూమి క్రిస్మస్ భోగమొందెను (దేవ)
    అక్షయమగు చుక్కఒకటి యాకోబులో- లక్షణముగ
    బుట్టవలయును ధాత్రిపై - రక్షణార్ధులే సదా నిరీక్షించెడు
    నక్షత్రంబగు రక్షకుడుదయించె


    daevastotragaanamul^ pai - divyasthalamulO - daevamaarugaanamul^ bhoo - daeSasthalamulO - daevalOkapaavanulanu - deena narulanu bOvajooDa bhuvi divi krismas^

  16. avvakichchinaTTi vaakku - adigO toTTilO pavvaLiMchi yunna daeva baalayaesulO = ivvidhamuga saphalamaayae - eedinaMbuna navvumOmu - naruni kabbenu || daeva ||

  17. shaemu daeva vaMdanaMbu - cheppabaDiyenu bhoomi stutula naMdu koneDi - poojaneeyuDu = bhoomipaina naruDugaanu - buTTavachchenu bhoomi krismas^ - bOgamoMdenu || daeva ||

  18. aMdari vaMSaMbulu nee - yaMdudaevena - boMdunaMchu nabraamunaku naMdenuvaakku = aMdekreestu yoodulakunu anyajanulakun^ viMdukrismas^ - viSvamaMtaTan^ || daeva ||

  19. sheelO vachchuvaraku yoodaalO niluchuchu - naeluraaju daMDa muMDu nepuDu tolagadu = naelameeda nityaSaaMti paalanajaeya paalakuMDau - baaluDu - janmiMchen^ || daeva ||

  20. akshayamagu chukkayokaTi - yaakObulO - lakshaNamuga buTTa valayunudhaatripai - rakshaNaardhulae sadaa ni - reekshiMcheDu nakshatraM bagu rakshakuDudayiMche || daeva ||

  21. puTTavalayu mOshaevaMTi - poorNa pravakta - eTTivaaralaina neruga naTTi dharmamul^ - diTTamuganu sthaapiMpa daevaputruDu - puTTen^ goppa - bOdhakuDaayenu || daeva ||

  22. mariya putra naama - mimmaanuyaelagun^ - narulaku daevuMDetODu niratamuvarakun^ - darinidaevuDuMDugaana - veravamennaDun^ parama daevuni sahavaasamu labhiMchun^ || daeva ||

  23. mananimittamaina SiSuvu - mahini buTTenu - chanuvuga darijaera SiSuvu - svaamiyaayenu = tanuvu rakshaNanu gaNiMpa - venukadaeyadu vinayabhooshaNulaku - vaeLavachchenu || daeva ||

  24. molakalettavale yeshayi - moddunaMduna - phalamulaeni mODu narula - vaMSavRkshamu = viluvagalugu nityajeeva - phalamuliDuTakai kaLagala janmaardhakaruDu vachchenu || daeva ||

  25. kalulu cheekaTin^ naDuchuchu - veluguchoochiri paluvidhaMbulaina yaTTi paapacheekaTul^ = tolagajaesi SuddhakaaMti - kalugajaeyunu - velugugaa daevuDu - velase dhaatrilO || daeva ||

  26. alpamaina betlehaemu - naMduna kreestu nilpavalenu tanadu janma - nijacharitranu = alpulaMdu saitamalpamainayooLLalO svalparakshasthaapakuDai vachche || daeva ||

  27. aaDitappanaTTidaeva - anaMtastotramul^ - naaDu palkuvaagdhaanamula nanniTin^ = naeDu neravaerchinaavu nee sutunaMpi keeDul^ baapu krismasugalge || daeva ||

  28. nee nijavaagdhattamulanu - nityamu nammi - vaani neravaerpulu vini - vaTTivi yanaka = maanasamuna nanubhaviMchu - manasu - neeyumani - daanamoolya - j~naanamosagumee || daeva ||

  29. gaganamaMdu krismasuMDu - gaanakeertulau - jagatiyaMdu krismasuMDu sthavamugalguta = yugayugamulavaraku traiku - DoMdu praNutulu sogasuga barigeDu - chOdyageetamul^ || daeva ||

Devalokamu numdi uyyalo devadhuthalocchiri దేవలోకమునుండి ఉయ్యాలో దేవదూతలొచ్చిరి


Song no:


దేవలోకమునుండి ఉయ్యాలో - దేవదూతలొచ్చిరి ఉయ్యాలో
దేవలోకంబెల్ల ఉయ్యాల - తేజరిల్లిపోయె ఉయ్యాల
మరియమ్మ గర్భాన ఉయ్యాల
 బాలుండడుగో ఉయ్యాల
పశువుల తొట్టదుగో ఉయ్యాల-
పసి పాలకుండడుగో ఉయ్యాల
గొల్ల బాలలొచ్చిరి ఉయ్యాల
 గొప్పగా మురిసిరి ఉయ్యాల
నా తండ్రి నాకోసం ఉయ్యాల
నరుడిగా పుట్టెను ఉయ్యాల
చుక్క ఇంటిపైన ఉయ్యాల
చక్కగా నిలిచెను ఉయ్యాల
తీర్పు జ్ఞానులొచ్చిరి ఉయ్యాల
చక్కగా మురుచిరి ఉయ్యాల

Devalokamu numdi uyyalo devadhuthalu vacchi దేవలోకము నుండి ఉయ్యాలో దేవదూతలు వచ్చి

Song no: 22

    దేవ లోకమునుండి ఉయ్యాలో దేవదూతలువచ్చి రుయ్యలో

  1. దేవలోకంబెల్ల ........ తేజరిల్లిపోయె

  2. గగనమార్గంబెల్ల ........ గణగణమ్రోగెను

  3. లోకము పరలోకము ........ యేకమై పోయెను

  4. పరలోకదేవుండు ........ ధరణిపై బుట్టెను

  5. మహిమబాలుండడిగో ........ మరియమ్మ ఒడిలోన

  6. సృష్టికర్తయడిగో ........ శిశువుగానున్నాడు

  7. పశువుల తొట్టిదిగో .......పసి పాలకుండడిగో

  8. బాలరాజునకు ....... పాటలు పాడండి

  9. బాలరక్షకునికి ....... స్తోత్రములు చేయండి

  10. పరలోకమంతట ....... పరమసంతోషమే

  11. నాతండ్రి నాకోసం ....... నరుడుగా బుట్టెను

  12. ముద్దు పెట్టుకొనుడి ........ ముచ్చట తీరంగ

  13. మురియుచు వేయండి ....... ముత్యాలహరములు

  14. గొల్లబోయలొచ్చిరి ....... గొప్పగ మురిసిరి

  15. తూర్పుజ్ఞాను లొచ్చిరి ....... దోసిలొగ్గి మ్రొక్కిరి

  16. దూతలందరు కూడిరి ....... గీతములు పాడిరి

  17. దేవస్థానమందు ........ దేవునికి సత్కీర్తి

  18. యేసుబాలుండిడిగో ....... ఎంతరమణేయుండు

  19. క్రీస్తుబాలుండిడిగో ....... క్రిస్మసు పండుగ

  20. యేసుక్రీస్తు ప్రభువు ...... ఏకరక్షణకర్త

  21. అర్ధరాత్రి వేళ ........ అంతయు సంభ్రమే

  22. అర్ఢరాత్రి వేళ ........ అంతయు సందడే

  23. మధ్యరాత్రి వేళ ....... మేలైన పాటలు

  24. మేల్కొని పాడండి ....... మంగళహరతులు

  25. చుక్క ఇంటిపైన ....... చక్కగా నిల్చెను

  26. తండ్రికి స్తొత్రముల్ ........ తనయునకు స్తొత్రములు




raagaM: - taaLaM: -



    daeva lOkamunuMDi uyyaalO daevadootaluvachchi ruyyalO


  1. daevalOkaMbella ........ taejarillipOye

  2. gaganamaargaMbella ........ gaNagaNamrOgenu

  3. lOkamu paralOkamu ........ yaekamai pOyenu

  4. paralOkadaevuMDu ........ dharaNipai buTTenu

  5. mahimabaaluMDaDigO ........ mariyamma oDilOna

  6. sRshTikartayaDigO ........ SiSuvugaanunnaaDu

  7. paSuvula toTTidigO .......pasi paalakuMDaDigO

  8. baalaraajunaku ....... paaTalu paaDaMDi

  9. baalarakshakuniki ....... stOtramulu chaeyaMDi

  10. paralOkamaMtaTa ....... paramasaMtOshamae

  11. naataMDri naakOsaM ....... naruDugaa buTTenu

  12. muddu peTTukonuDi ........ muchchaTa teeraMga

  13. muriyuchu vaeyaMDi ....... mutyaalaharamulu

  14. gollabOyalochchiri ....... goppaga murisiri

  15. toorpuj~naanu lochchiri ....... dOsiloggi mrokkiri

  16. dootalaMdaru kooDiri ....... geetamulu paaDiri

  17. daevasthaanamaMdu ........ daevuniki satkeerti

  18. yaesubaaluMDiDigO ....... eMtaramaNaeyuMDu

  19. kreestubaaluMDiDigO ....... krismasu paMDuga

  20. yaesukreestu prabhuvu ...... aekarakshaNakarta

  21. ardharaatri vaeLa ........ aMtayu saMbhramae

  22. arDharaatri vaeLa ........ aMtayu saMdaDae

  23. madhyaraatri vaeLa ....... maelaina paaTalu

  24. maelkoni paaDaMDi ....... maMgaLaharatulu

  25. chukka iMTipaina ....... chakkagaa nilchenu

  26. taMDriki stotramul^ ........ tanayunaku stotramulu

Devadhutha christmas dhuthasena Christmas దేవదూత క్రిస్మసు దూతసేన క్రిస్మసు గొల్లవారి క్రిస్మసు


Song no:


దేవదూత క్రిస్మసు .... దూతసేన క్రిస్మసు
గొల్లవారి క్రిస్మసు .... తూర్పుజ్ఞాని క్రిస్మసు
చిన్నవారి క్రిస్మసు .... పెద్దవారి క్రిస్మసు
దేశమంత క్రిస్మసు .... లోకమంత క్రిస్మసు
పల్లెయందు క్రిస్మసు .... పట్నమందు క్రిస్మసు
దేశమంత క్రిస్మసు .... లోకమంత క్రిస్మసు
క్రిస్మసన్న పండుగ .... చేసికొన్న మెండుగ
మానవాత్మ నిండుగ .... చేయకున్న దండుగ
క్రీస్తు దేవదానము .... దేవావాక్య ధ్యానము
క్రీస్తు శిష్యగానము .... వీనికాత్మ స్థానము
కన్నవారి క్రిస్మసు .... విన్నవారి క్రిస్మసు
క్రైస్తవాళి క్రిస్మసు .... ఎల్లవారి క్రిస్మసు
పాపలోకమందున .... క్రీస్తు పుట్టినందున
పాపికెంతో మోక్షము .... సువార్త సాక్ష్యము
క్రీస్తే సర్వభూపతి .... నమ్మవారి సద్గతి
మేము చెప్పు సంగతి .... నమ్మకున్న దుర్గతి

Deva mahonnathuda mahima prabhavithuda దేవ మహోన్నతుడా మహిమా ప్రభావితుడా


Song no:


దేవ మహోన్నతుడా మహిమా ప్రభావితుడా
పదివేలలో అతి సుందరుడా
కీర్తింతు  మనసారా               దేవ
వెలిసావు భువిలో యెసయ్యగా
ఏడారి  బ్రతుకులో సెలయేరుగా      “2”
నిస్సారమైన నా జీవితము   చిగురించే
ఆనందము  “2” “పదివేలల
లేచాను  ఒంటరి  విశ్వసినై
వేధికాను  నీధారి   అన్వేషనై             “2”
నీ దివ్య మార్గము దర్శించిన
ఫలియించు నా జన్మము                   “2”  పదివేలలో