Song no: 106
రా – ఆనందభైరవి
తా – త్రిపుట
రా – ఆనందభైరవి
తా – త్రిపుట
వచ్చిగాబ్రియేలు పల్కెను – మరియ – మచ్చకంటిడెంద ముల్కెను = హెచ్చైన శుభముల – నెనలేని కృప దేవుఁ డిచ్చి యింతులలోని – న్నెచ్చు జేయునటంచు ॥వచ్చి॥
- భయ మాత్మలో వీడు కన్యకా – నీవు – దయబొంది యున్నావు ధన్యగా = రయముగ నిదిగోగ – ర్భముఁ దాల్చెదవు పుత్రో – దయమౌ యేసను పేర – తని కిడు మంచును ॥వచ్చి॥
- అతఁడెన్నఁబడును మహాత్ముడై – సర్వో – న్నతుఁడైన దైవకుమారుఁడై = హిత మొప్పు దేవుండు – న్నతిఁ జేసి దావీదు – వితత సింహాసన – మతని కిచ్చునంచు ॥వచ్చి॥
- ఘనతరుఁడగు వాని రాజ్యము – అంత – మొనగూడ దది నిత్యపూజ్యము = వనితమగు యాకోబు – వంశ మెల్లపు డేలు – కొను నాతఁ డనుంచుఁ దె – ల్పెను దూత మరియతో ॥వచ్చి॥