Song no: 108
రా – కమాసు
తా – త్రిపుట
కొనియాడఁ దరమె నిన్ను-కోమల హృదయ – కొనియాడఁ దరమె నిన్ను = తనరారు దినకరుఁ – బెనుతారలను మించు – ఘనతేజమున నొప్పు — కాంతిమంతుఁడ వీవు ॥కొనియాడ॥
- ఖెరుబులు సెరుపులు – మరి దూతగణములు = నురుతరంబుగఁ గొలువ – నొప్పు శ్రేష్ఠుఁడ వీవు ॥కొనియాడ॥
- సర్వలోకంబులఁ – బర్వు దేవుఁడ వయ్యు = నుర్వి స్త్రీ గర్భాన – నుద్భవించితి వీవు ॥కొనియాడ॥
- విశ్వమంతయు నేలు – వీరాసనుఁడ వయ్యుఁ = పశ్వాళితోఁ దొట్టిఁ – పండియుంటివి నీవు ॥కొనియాడ॥
- దోసంబులను మడియు – దాసాళిఁ గరుణించి = యేసు పేరున జగతి కేగుదెంచితి నీవు ॥కొనియాడ॥
- నరులయందునఁ గరుణ = ధర సమాధానంబు = చిరకాలమును మహిమ పరఁగఁ జేయుదు వీవు ॥కొనియాడ॥
- ఓ యేసు పాన్పుగ – నా యాత్మఁ జేకొని = శ్రేయముగ బవళించు శ్రీకరవరసుత ॥కొనియాడ॥