Song no: 120
రా – యదుకుల కాంభోజి
తా – ఆది
చూడరే మాఱేఁడు – పుట్టి – నాఁడు బెత్లెహేములో = నేఁడీ భూమి వాసులకు – నిండు రక్షణబ్చెను ||చూడరే||
- ఎన్నరాని దేవ దీప్తి – మున్ను మిన్ను గ్రమ్మెను = పన్నుగా రేయెండ కాంతి – కన్ననది మించెను ||చూడరే||
- దూత తెల్పె వ్రేల కొక – ప్రీతియగు ముచ్చటన్- ఖ్యాతిగ దావీదు పురిని – కర్తయేసు పుట్టుటన్ ||చూడరే||
- తూరుపున జ్ఞానులొక్క – తార దివిని గాంచిరి = వారు వీరు వచ్చి సేవ – వరుసగాను జేసిరి ||చూడరే||
- మక్కువతో మనమెల్ల – మ్రొక్కి సేవఁ జేతము = మిక్కుటముగ మనకు శాంతిఁ – గ్రక్కున నొసంగును ||చూడరే||