Song no: 123
తా – ఆది
ఇశ్రాయేలీయుల దేవుండే – యెంతో స్తుతి నొందును గాక = యాశ్రితువౌ తన జనులకు దర్శన – మాత్మ విమోచన కలిగించె ॥నిశ్రా॥
- తన దాసుఁడు దావీదు గృహంబున – ఘన రక్షణ శృంగము నిచ్చె = మన శత్రువు లగు ద్వేషులనుండియు – మనలన్ బాపి రక్షణ నిచ్చె ॥నిశ్రా॥
- దీనిని గూర్చి ప్రవక్తల నోట – దేవుఁడు పలికించెను దొల్లి = మానవ మన పితరులఁ గరుణింపఁగ – మహిలోన నిబంధనఁ జేసె ॥నిశ్రా॥
- జనకుం దగు నబ్రాహాముతోఁ – జేసిన యా ప్రమాణముఁ దలఁచి = మనము విరోధులనుండి విమోచన – గని నిర్భయులమై మెలఁగ ॥నిశ్రా॥
- ఆయన సన్నిధానమునందు – నతి శుద్ధిగ నీతిగ నుండఁ = పాయక తన సేవను నిత్యంబును – జేయఁగ నీ రక్షణ నిచ్చె ॥నిశ్రా॥
- ధర నో శిశువా దేవుని దీర్ఘ – దర్శి వనెడు పేరొందెదవు = పరమేశ్వరుని వాత్సల్యతతోఁ = పాపవిముక్తిఁ బ్రజ లొంద ॥నిశ్రా॥
- మానుగ రక్షణ జ్ఞాన మొసంగఁగ – మార్గము సిద్ధపరచుటకై – దీన మనస్సుతోఁ బ్రభునకు ముందు – గా నడిచెదవు భయభక్తి ॥నిశ్రా॥
- మరియును సమాధాన సరణిలో – మన మిఁక నడువఁ జీఁకటిలో = మరణచ్ఛాయలో నుండిన వారికి – నరుణోదయ దర్శన మిచ్చె ॥నిశ్రా॥
- జనక పుత్రాత్మ దేవుని కిలలో – ఘనత మహిమ కల్గును గాక = మును పిపు డెప్పుడు తనరి నట్లు యుగ – ములకును దనరారునుగా కామేన్ ॥నిశ్రా॥