Santhoshinchandi yandharu natho సంతోషించుఁడి యందరు నాతో

ly
0


Song no: 113
రా – శంకరాభరణము
తా – ఆది

సంతోషించుఁడి – యందరు నాతో – సంతోషించుఁడి – యొక = వింతయగు కీర్తనఁ బాడ వచ్చితిని – సంతోషించుఁడి – నాతో ॥సంతో॥
  1. అంధకార మయమైన భూమి నా – ద్యంతము వెలిఁగింప – దాని యూ – వేశముఁ దొలఁగింప = వందితుండు క్రీస్తేసు నాధుఁడు – వచ్చెఁ బ్రకాశుండై – భూమికి – నిచ్చె ప్రకాశంబు ॥సంతో॥
  2. కాన నంధకారంబు దొలఁగఁ ప్ర – కాశించెను లెండు – విూరు ప్ర – కాశింపను రండు = మానవులను సంతోషపర్చనై – మహిని నవతరించె – భక్తుల – మనము సంతసించె ॥సంతో॥
  3. మిన్ను నుండి సంతోషోదయము – మిగుల ప్రకాశించె – హృదయములఁ – దగులఁ ప్రకాశించె = మున్ను జేయఁబడిన వాగ్ధత్తము – తిన్నగ నెరవేరె భక్తుల – కన్ను లాస దీరె ॥సంతో॥
  4. ప్రీతియైన నీ పండుగ గూర్చి – నూతన కీర్తనను – గలసికొని – నాతోఁ పాడుచును = నీ తరి దూరస్తుల కీ వార్తను – నే తీరును నైనఁ – దెలుపఁగ – నాతురపడవలెను ॥సంతో॥
  5. పాపులపై దేవునికిఁ గలిగిన – ప్రబలమైన దయను – లోకమునఁ – జూపింపఁ గవలెను = జూపకపోయిన లోపము మనపై – మోపఁబడును నిజము – వేగము – జూపద మా పథము ॥సంతో॥

Post a Comment

0Comments

Post a Comment (0)