Bilmoria
Song no: 112
రా – మధ్యమావతి
తా – అట
రక్షకుండుదయించినాఁడఁట – మనకొరకుఁబరమ – రక్షకుం డుదయించి నాఁడఁట = రక్షకుండుదయించినాఁడు – రారె గొల్లబోయలార – తక్షణమనఁ బోయి మన ని – రీక్షణ ఫల మొందుదము ॥రక్షకుండు॥
- దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాఁడు = దేవుఁడగు యెహోవా మన – దిక్కుఁ దేరి చూచినాఁడు ॥రక్షకుండు॥
- గగనమునుండి డిగ్గి – ఘనుఁడు గబ్రియేలు దూత = తగినట్టు చెప్పె వారికి – మిగుల సంతోషవార్త ॥రక్షకుండు॥
- వర్తమానము జెప్పి దూత – వైభవమున పోవుచున్నాఁడు = కర్తను జూచిన వెనుక – కాంతుము విశ్రమం బప్పుడు ॥రక్షకుండు॥
- పశువుల తొట్టిలోన – భాసిల్లు వస్త్రములజుట్టి = శిశువును గనుగొందురని – శీఘ్రముగను దూత తెల్పె ॥రక్షకుండు॥
- అనుచు గొల్ల లొకరి కొక – రానవాలు జెప్పకొనుచు = అనుమతించి కడకుఁ క్రీస్తు – నందరికినీ దెల్పినారు ॥రక్షకుండు॥