Song no: 83
- యెహోవాయే నా కాపరిగా - నాకేమి కొదువగును (2X)
- పచ్చీకగల చోట్లలో - నన్నాయనే పరుండజేయును
శాంతియుతమైన జలములలో - నన్నాయనే నడిపించును || యెహోవాయే ||
- గాడాంధకారపు లోయలలో - నడచినా నేను భయపడను
నీ దుడ్డుకఱ్ఱయు నీ దండమును - నాకు తోడై నడిపించును || యెహోవాయే ||
- నా శత్రువుల యెదుట నీవు - నా బోజనం సిద్ద పరచితివి
నా తల నూనెతో అంటియుంటివి - నా గిన్నె నిండి పొర్లు చున్నది || యెహోవాయే ||
- నా బ్రతుకు దినంబులన్నియును - ని కృపాక్షేమాలే నా వెంట వచ్చును
నీ మందిరములో నే చిరకాలము - నివాసం చేయ నాశింతును || యెహోవాయే ||