Song no: 186
HD
- ఆరాధన స్తుతి ఆరాధన
- సర్వసృష్టికి ఆధారుడా-సకలజీవుల పోషకుడా } 2
సీయోనులోనుండి దీవించువాడవు
సదాకాలము జీవించువాడవు
సాగిలపడినే నమస్కరించి
సర్వదా నిను కొనియాడేద-నిన్నే కీర్తించెద } 2 || తండ్రియైన ||
- సార్వత్రిక సంఘస్థాపకుడా-సర్వలోక రక్షకుడా } 2
సిలువలో నీ రక్తమే నాకై కార్చితివి
శిథిలము కాని నగరమును కట్టితివి
స్తోత్రము చెల్లింతు నీ కీర్తి తలచి
సర్వలోకాన నీమహిమను నేను ప్రకటింతును } 2 || తండ్రియైన ||
- సర్వసత్యమునకు ఆధారమై-పరిశుద్ధయాజకుల సారధివై } 2
యాజక రాజ్యములో నను చేర్చుటకై
నిత్యయాజకత్వమును ధరింపజేసితివి
మహిమతో పరిచర్య నే చేయుటకై
నూతన కృపలను నే పొందెద-ఆత్మతో శక్తితో సాగేద } 2 || తండ్రియైన ||
ఆత్మతో సత్యముతో నీకే ఆరాధన
తండ్రియైన దేవా-కుమారుడైన ప్రభువా - పరిశుద్దాత్మ దేవా
త్రియేక దేవా ఆరాధన స్తుతి ఆరాధన } 2