Yesu devude naa konda yesu devude naa anda యేసు దేవుడే నా కొండ! యేసు దేవుడే నా అండ!

Song no:

    యేసు దేవుడే నా కొండ! యేసు దేవుడే నా అండ!
    యేసు దేవుడే నా విజయ జెండా!
    యేసు దేవుడే నా అండదండ రా!
    యేసు ఉండగా నాకు దిగులు లేదు రా! ||2||
    అరె యిన్నాళ్ళు నాకున్న ఏకైక ఆధారం యేసే యేసే యేసే!
    నిన్నైనా నేడైనా రేపైనా నా మహిమ యేసే యేసే యేసే!
    కొదువ నాకు కలుగనీడు – భయమనేదే చేరనీడు
    తలను నన్ను దించనీడు – మహిమ నాపై ఉంచినాడు
    ఈ ఒక్కడు ఉంటే చాలు నేను king నే!
    Jesus is my Glory – (6)

  1. నా మీదికి లేచిన వారు అనేకులు వారు బలవంతులు
    నా దేవుని నుండి సహాయము నాకు దొరకదని వారందురు
    నా మీదికి లేచిన వారు అనేకులు వారు బహు మూర్ఖులు
    నా దేవుని నుండి రక్షణ ఏదీ నాకు దొరకదని వారందురు
    అలాంటి వ్యర్ధమైన మాట నేను లక్ష్యపెట్టను
    నేను నమ్ముకున్న దేవుని నేనెరిగియున్నాను
    అలాంటి వ్యర్ధమైన మాట నేను లక్ష్యపెట్టను
    నా తలను ఎత్తే దేవుని నేనెరిగియున్నాను
    నా మహిమకు ఆస్పదము కేడెం యేసే!

  2. నా దేవుని సహాయంబుతో సైన్యాలనే నేను జయింతును
    నా దేవుని సామర్థ్యంబుతో ప్రాకారముల నేను దాటేతును
    అరెరే క్రమ క్రమంగా ప్రభువు నన్ను సిద్ధపరచును
    అమాంతంగా ఒక్క రాత్రిలోనే పైకి లేపును
    అంచెలు అంచెలుగా ప్రభువు నన్ను సిద్ధపరచును
    అమాంతంగా ఒక్క రాత్రిలోనే పైకి లేపును
    నాకాధారం నరుడు కాడు దేవుడే!

    One man just one man With God is Majority

  3. బహుమందియే మాతో ఉన్ననూ యుద్ధాన్ని చేసేది ప్రభువే గదా!
    ఏ ఒక్కరూ లేకున్ననూ మా ముందు నడిచేది యేసే కదా!
    అనేక మందియైన జనముల చేతనే అయినా
    అరెరే కొద్దిమంది ఉన్న చిన్న గుంపుతోనైనా
    రక్షించుటకు యెహోవాకు అడ్డమా!

  4. యుద్ధానికి నాకు బలం ధరియింపజేసేది నా దేవుడే
    నా చేతికి నా వ్రేళ్ళకు పోరాటం నేర్పేది ప్రభు యేసుడే
    ఇత్తడి విల్లును నా బాహువులు ఎక్కుపెట్టును
    యెహోవా రక్షణ సువార్త బాణం సంధియింతును
    ఆ శత్రువుకేమో ఉగ్రత, మనకు రక్షణ!

  5. బలవంతుడౌ ప్రభు చేతిలో పదునైన బాణంగా నన్నుంచెను
    తన చేతిలో గండ్రగొడ్డలి వంటి యుద్ధాయుధముగా నను పట్టెను
    అరెరే కక్కులున్న నురిపిడి మ్రానుగా నన్ను
    ప్రభువు చేసినాడు పర్వతాల్ని నూర్చివేయను
    అరెరే కక్కులున్న నురిపిడి మ్రానుగా నన్ను
    ప్రభువు చేసినాడు దుర్గములను కూలగొట్టను
    ఆ శత్రు స్థావరాల్ని పిండి చేతును!


Share:

No comments:

Post a Comment

Popular Products

Labels

Blog Archive

Recent Posts

Unordered List

  • Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit.
  • Aliquam tincidunt mauris eu risus.
  • Vestibulum auctor dapibus neque.

Pages