Deva yehova sthuthi pathrunda parishudthalaya దేవ యెహోవా స్తుతి పాత్రుండ - పరిశుద్ధాలయ

ly
0
Song no: 8

    దేవ యెహోవా స్తుతి పాత్రుండ - పరిశుద్ధాలయ పరమ నివాసా || దేవ ||

  1. బలమును కీర్తియు శక్తి ప్రసిద్ధత సర్వము నీవే = సకల ప్రాణులు స్తుతి చెల్లించగ - సర్వద నిను స్తుతులొనరించగనున్న || దేవ ||

  2. నీదు పరాక్రమ కార్యములన్నియు నిరతము నీవే = నీదు ప్రభావ మహాత్యములన్నియు - నిత్యము పొగడగ నిరతము స్తోత్రములే || దేవ ||

  3. స్వర మండల సితారలతోను బూరల ధ్వనితో = తంబురలతో నాట్యములాడుచు - నిను స్తుతియించుచు స్తోత్రము జేసెదము || దేవ ||

  4. తంతి వాద్య పిల్లన గ్రోవి మ్రోగెడు తాళము = గంభీర ధ్వనిగల తాళములతో - ఘనుడగు దేవుని కీర్తించను రారే || దేవ ||

  5. పరమాకాశపు దూతల సేనలు పొగడగ మీరు = ప్రేమమయుని స్తోత్రము చేయగ - పరమానందుని వేగస్మరించను రారే || దేవ ||

  6. సూర్య చంద్ర నక్షత్రంబు గోళములారా = పర్వతమున్నగు వృక్షములారా - పశువులారా ప్రణుతించను రారే || దేవ ||

  7. అగ్నియు మంచును సముద్ర ద్వీప కల్పము లారా = హిమమా వాయువు తుఫానులారా - మేఘములారా మహిమ పరచరారే || దేవ ||

  8. సకల జలచర సర్వ సమూహములారా = ఓ ప్రజలారా భూపతులారా - మహనీయుండగు దేవుని స్తుతి చేయన్ || దేవ ||





    daeva yehOvaa stuti paatruMDa - pariSuddhaalaya parama nivaasaa || daeva ||

  1. balamunu keertiyu Sakti prasiddhata sarvamu neevae = sakala praaNulu stuti chelliMchaga - sarvada ninu stutulonariMchaganunna || daeva ||

  2. needu paraakrama kaaryamulanniyu niratamu neevae = needu prabhaava mahaatyamulanniyu - nityamu pogaDaga niratamu stOtramulae || daeva ||

  3. svara maMDala sitaaralatOnu boorala dhvanitO = taMburalatO naaTyamulaaDuchu - ninu stutiyiMchuchu stOtramu jaesedamu || daeva ||

  4. taMti vaadya pillana grOvi mrOgeDu taaLamu = gaMbheera dhvanigala taaLamulatO - ghanuDagu daevuni keertiMchanu raarae || daeva ||

  5. paramaakaaSapu dootala saenalu pogaDaga meeru = praemamayuni stOtramu chaeyaga - paramaanaMduni vaegasmariMchanu raarae || daeva ||

  6. soorya chaMdra nakshatraMbu gOLamulaaraa = parvatamunnagu vRkshamulaaraa - paSuvulaaraa praNutiMchanu raarae || daeva ||

  7. agniyu maMchunu samudra dveepa kalpamu laaraa = himamaa vaayuvu tuphaanulaaraa - maeghamulaaraa mahima paracharaarae || daeva ||

  8. sakala jalachara sarva samoohamulaaraa = O prajalaaraa bhoopatulaaraa - mahaneeyuMDagu daevuni stuti chaeyan^ || daeva ||

Post a Comment

0Comments

Post a Comment (0)