Song no: 37
సన్నిహితుడా స్నేహితుడా
సమీపస్తుడా నా ప్రాణనాధుడా
నా సఖుడా నా హితుడా
శ్రీమంతుడా సృజనాత్ముడా
వేళకాని వేళలో వెంబడించినావయా
దప్పిగొన్నానంటూ దాపుచేరినావయా
పరులు చూడ
పాపినంటూ త్రోసివేసినారయ
బందువులే దోషినంటూ
వెలివేసినారయా
స్నేహితుడా యేసయ్యా
శ్రీమంతుడా సృజనాత్ముడా
నా పాపశిక్షణంతా
నీవె భరియించావయా
వెలయిచ్చి విమోచించి
నీ సొత్తుగ చేసావయా
మధురమైన ప్రేమను చూపి
నన్ను మార్చితివయా
మలినమైన నా బ్రతుకును
మహిమగ మలిచావయా
No comments:
Post a Comment