Papaniki naku ye sambandhamu ledhu పాపానికి నాకు ఏ సంబంధము లేదు

ly
0
Song no:
    పాపానికి నాకు ఏ సంబంధము లేదు
    పాపానికి నాపై ఏ అధికారము లేదు
    పాపానికి నాకు ఏ సంబంధము లేదు
    పాపానికి నాపై ఏ అజమాయిషి లేదు
    నా పాపములు అన్నీ నా ప్రభువు ఏనాడో క్షమియించి వేశాడుగా!
    మరి వాటినెన్నడును జ్ఞాపకము చేసికొనను అని మాట యిచ్చాడుగా!

    || నేనున్నా నేనున్నా నా యేసుని కృప క్రింద
    నే లేను నే లేను ధర్మశాస్త్రం క్రింద ||

  1. 1. కృప ఉందని పాపం చెయ్యొచ్చా – అట్లనరాదు!
    కృప ఉందని నీతిని విడువొచ్చా – అట్లనరాదు!
    కృప ఉందని పాపం చెయ్యొచ్చా – అట్లనరాదు!
    కృప ఉందని నీతిని విడువొచ్చా!! – No
    కృప అంటే license కాదు, కృప అంటే freepass కాదు, పాపాన్ని చేసేందుకు!
    కృప అంటే దేవుని శక్తి, కృప అంటే దేవుని నీతి, పాపాన్ని గెలిచేందుకు!

    Grace is not a licence to sin
    it’s the power of God to overcome

  2. కృప ద్వారా ధర్మశాస్త్రముకు మృతుడను అయ్యా!
    కృప వలన క్రీస్తులో స్వాతంత్ర్యం నే పొందితినయ్యా!
    కృప ద్వారా ధర్మశాస్త్రముకు మృతుడను అయ్యా!
    కృప వలనే క్రీస్తులో స్వాతంత్ర్యం!!
    క్రియల మూలముగా కాదు, కృపయే నను రక్షించినది, నా భారం తొలగించినది
    కృప నన్ను మార్చేసినది, నీతి సద్భక్తులతోడ బ్రతుకమని బోధించినది

    Grace took away burden from me
    and taught me to live righteously

  3. పాపానికి మృతుడను నేనయ్యా! – హల్లెలూయా!
    కృప వలనే యిది నాకు సాధ్యం అయ్యిందిరా భయ్యా!
    పాపానికి మృతుడను నేనయ్యా! – హల్లెలూయా!
    కృప వలనే యిది నాకు సాధ్యం!!
    కృపను రుచి చూచిన నేను, దేవునికే లోబడుతాను, పాపానికి చోటివ్వను
    పరిశుద్ధత పొందిన నేను, నీతి సాధనములుగానే, దేహం ప్రభుకర్పింతును

  4. Yield your bodies (members) unto the Lord
    as instruments of righteousness

  5. ధర్మశాస్త్రం పాపం అయ్యిందా – అట్లనరాదు
    ధర్మశాస్త్రం వ్యర్థం అయ్యిందా – అట్లనరాదు
    ధర్మశాస్త్రం పాపం అయ్యిందా – అట్లనరాదు
    ధర్మశాస్త్రం వ్యర్థం అయ్యిందా!! – No
    ధర్మశాస్త్రం కొంతకాలమేగా, ధర్మశాస్త్రం బాలశిక్షయేగా, ప్రభునొద్దకు నడిపేందుకు!
    క్రీస్తొచ్చి కృప తెచ్చెనుగా, ధర్మశాస్త్రం నెరవేర్చెనుగా, మనలను విడిపించేందుకు!

Post a Comment

0Comments

Post a Comment (0)