-->

Padana mounamugane stuthi keerthana పాడనా మౌనముగానే స్తుతి కీర్తన చూడనా ఊరకనే నిలిచి

Song no: 150
పాడనా..మౌనముగానే - స్తుతి కీర్తన
చూడనా ఊరకనే నిలిచి - నీ పరాక్రమ కార్యములు = 2
యేసయ్యా నీతో సహజీవనము - నా ఆశలు తీర్చీ తృప్తి పరచెనే - 2

1. ప్రతి ఉదయమున - నీ కృపలో నేను ఉల్లసింతునే
నీ రక్తాభిషేకము కడిగెనే - నా ప్రాణాత్మశరీరమును = 2
నా విమోచనా గానము నీవే - నా రక్షణ శృంగము నీవే - 2

2. దీర్ఘ శాంతమూ - నీ కాడిని మోయుచూ నేర్చుకొందునే
నీ ప్రశాంత పవనాలు అణచెనే - నా వ్యామోహపు పొంగులన్నియూ = 2
నా ఓదార్పు నిధివీ నీవే - నా ఆనంద క్షేత్రము నీవే - 2

3. నీ ఆలయమై - నీ మహిమను నేను కప్పుకొంటినే
నీ తైలాభిషేకము నిండెనే - నా అంతరంగమంతయునూ = 2
నా మానస వీణవు నీవే - నా ఆరాధన పల్లకి నీవే - 2

Share:

Related Posts:

No comments:

Post a Comment

Facebook

lent

Good friday

Powered by Blogger.


123

1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నదరంబయో కన్న ...

Search This Blog

3/related/default

Text Widget

Contributors

Categories

Pages

No Thumbnail

No Thumbnail
50

Most Recent

Recent Posts