Song no: 40
నా ప్రాణ ప్రియుడవు
నీవే యేసయ్యా
నను కన్న దైవము నీవే యేసయ్య
దవళ వర్ణుడవు రత్నవర్ణుడవు
అందరిలో అతి కాంక్షనీయుడవు
పిలువగనే పలికే నా ప్రియుడా
వెదకగనే దొరికే నా విభుడా
నా ప్రాణమునకు సేదదీర్చి
నను ఇల నడిపిన నాయేసువా
నా పాపమునకు పరిహారముగా
నీ ప్రాణమునే దారపోసి
మరణము నుండి విమోచించి
జీవము నొసగిన నా క్రీస్తువా
No comments:
Post a Comment