50
కూడికొని యున్నాము సంఘ ప్రభో Kudikoni yunnamu sanga prabho
18
రాగం -
(చాయ: )
తాళం -
కూడికొని యున్నాము సంఘ ప్రభో కూడికొని యున్నాము తోడ నుండెద ననుచు నమ్ముచు దొడ్డ దగు నీ పాద సన్నిధి
||కూడికొని||
ఎచట నా ప్రియ భక్తులెలమిఁ గూడియున్న నచటికి నేతెంతునని పల్కితి విచట నుండు మమ్ము వీక్షించి కృపచేత నిపుడు దీవించు మీ యేసు క్రీస్తునాధా
||కూడికొని||
గత కాలమందున గాని చేఁతలచే దుర్గతి నొంది యుండఁగాఁ గనుఁగొంటివి శత సంఖ్య గల పాపచయ మీవు క్షమియించి యతి శాంతి నిడితివి యాత్మస్వరూపా
||కూడికొని||
నిరతము నీ ప్రేమ నెనరున ధ్యానించి పరమ ధర్మములందుఁ బరతఁ గల్గి యరులకు శుభములు నిరతంబుఁ జేయఁగఁ దిరత మా కొసఁగుము దేవుని ప్రియ తనయా
||కూడికొని||
అన్ని శోధనముల నన్ని విపత్తుల నన్ని కాలములందు నాదరించి నిన్ను నమ్మిన జనుల నీ సందిటను జేర్చి పన్నుగఁ గాపాడు ప్రభు యేసు క్రీస్తు
||కూడికొని||
అమలుఁడ నగు నన్ననుకరించుండనుచు నాన తిచ్చినాఁడ వాత్మజులకు నమల మార్గము నందు నరుగంగ మాకీవు విమలాత్మ దయసేయు వేగంబు మా తండ్రీ
||కూడికొని||
update
|| Update ||
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment