50
నాకేమి కొదువ నాధుఁడుండ నిఁక శ్రీకరుండగు
14 59
రాగం - సావేరి
(23-వ దావీదు కీర్తన)
తాళం - త్రిపుట
నాకేమి కొదువ - నాధుడుండ ఇక = శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్టపాలకుడు - నాయేక రక్షకుడు గనుక
|| నాకేమి ||
ఎన్నటికైన ఎండనట్టి - ఇక = సన్న పచ్చికవంటి తరుగని - సదుపాయం బుల్ - నాకెన్నో చేయున్ గనుక
|| నాకేమి ||
తనివి తీరన్ మేళ్ళనుభవింప - నేను = నను సదా మేళ్ళనెడి పచ్చిక నదిమి మృధువుగ - పండు - కొనజేయును గనుక
|| నాకేమి ||
ఎంత శోధన - యెండయున్న - నాకు = ఎంతకు న్నోరిగర దెపుడు శాంతజలములు - నాచెంతనే యుండున్ గనుక
|| నాకేమి ||
తప్పిపోయిన నన్ - దారింబెట్టి - ఇక = తెప్పరిల్లచేసి నాకు - తీర్చు నలసటను - నాతప్పు మన్నించున్ గనుక
|| నాకేమి ||
నీతి మార్గమున్ నిల్పును నన్ను - ఇక = నీతిలేనినాకు తన సు -నీతి దయచేయున్ స్వ-నీతినిన్ ద్రుంచున్
|| నాకేమి ||
చావుచీకట్ల - శక్తియుండు -ఇక = లోయలోబడి పోవలసిననను - నే వెరవకుండ - నా దేవుడే తోడు గనుక
|| నాకేమి ||
కష్టంబులను చీ-కటి లోయలో - ఇక = స్పష్టముగ ఘనసౌఖ్యమును నాదృష్టికింజూపి - నా - నష్టముల్ దీర్చున్ గనుక
|| నాకేమి ||
మీదపడునట్టి - శోధనలన్ - నా - నాదరికి రానీక దండము - నన్ను లాగుచును - నా - కాధరణయౌను గనుక
|| నాకేమి ||
పగవారల్ సిగ్గు-పడునట్లుగా - ఇక = జగతి యెరుగని - సౌఖ్యభోజన మగుపరచుచున్ - హా - తగినదే పెట్టున్ గనుక
|| నాకేమి ||
తనయాత్మనంద - తైలంబుతో - నన్ను = అనుదినము తలయంటి విసుగ-కొనక తుడుచును - నా - కనునీళ్ళన్ని గనుక
|| నాకేమి ||
పలువిధములైన - భాగ్యములతో - నాకు = వెలుపలికి దిగ - వెడలు నట్టి వెలగలగిన్నె - నా కలిమిగా జేయున్ గనుక
|| నాకేమి ||
బ్రతుకంతటన్ కృ-పాక్షేమములు - నా = వదలకుండగవచ్చు నాతో - సుదినములుగల్గు - నా - పదలు సంపదలౌ గనుక
|| నాకేమి ||
దురితంబులుండు - ధరణి నాకు - ఇక = ఇరవుకాదిక - నెప్పటికినా పరమ దేవుని - మందిరమె నాయిల్లు గనుక
|| నాకేమి ||
రెండవ భాగము
కావలసినవెల్ల - కనబడ గలవు - మనకు = ఏవియడిగిన - వాని నిచ్చి వేయును తండ్రి - ఇచ్చి
|| నాకేమి ||
ధనసహాయంబు - మనకుగలుగు నేడు అనుదినంబు - తండ్రి మనకు అక్కరలు తీర్చు - మన
|| నాకేమి ||
బస యేర్పాటులు మా - ప్రభువే చేయున్ - నా = బస దిగిన స్థలమందు మా - ప్రభువె నివసించున్ - మా
|| నాకేమి ||
ప్రభువు దూతలును - పరిశుద్ధులున్ - ఇక = విభవముగ మన మధ్య - మసలుచు వెల్గుచుందురుగా - హా
|| నాకేమి ||
జనకునియిష్ట - జనము వచ్చు ఇక తనకు యిష్టముగాని జనమును దరికి రానీయడు - ఈ
|| నాకేమి ||
మామిత్రులైన - మహిమ దూతలే - ఇక = క్షేమమునకై మాచుట్టు - చేరికాయుదురు - చుట్టు
|| నాకేమి ||
అందరుమేళ్ళు - అనుభవింప - ఇపుడు = విందుగా సమకూడు వార్తలు వినిపించును - తండ్రి
|| నాకేమి ||
ప్రభుని శరీర - రక్తములు - నా = ఉభయ జీవితములకు - మేలై ఉండును - నాకు
|| నాకేమి ||
నైజపాపములు - నశియించుటకే - మన = భోజనము వడ్డించును - రాజేస్వయముగా - దేవ
|| నాకేమి ||
నీ మనసులోనివి - నెరవేరును - ఇక = క్షేమముగనే ఉండవలయు - చింతలేకుండ - నీవు - చింతలేకుండ - గనుక
|| నాకేమి ||
నాకు నాతండ్రి - నరరూపముతో - ఇక = త్రైకునిరీతిగ కనబడి ధైర్య మిచ్చును - నాకు - ధైర్యమిచ్చును - గనుక
|| నాకేమి ||
జనక సుతాత్మ - లను దేవుడు - ఇక = ఘనముగా యుగములనన్నిట వినుతులొందును - నేనా - యన గొర్రెనే గనుక
|| నాకేమి ||
naakaemi koduva - naadhuDuMDa ika = SreekaruMDagu daevuDae naa SraeshTapaalakuDu - naayaeka rakshakuDu ganuka
|| naakaemi ||
ennaTikaina eMDanaTTi - ika = sanna pachchikavaMTi tarugani - sadupaayaM bul^ - naakennO chaeyun^ ganuka
|| naakaemi ||
tanivi teeran^ maeLLanubhaviMpa - naenu = nanu sadaa maeLLaneDi pachchika nadimi mRdhuvuga - paMDu - konajaeyunu ganuka
|| naakaemi ||
eMta SOdhana - yeMDayunna - naaku = eMtaku nnOrigara depuDu SaaMtajalamulu - naacheMtanae yuMDun^ ganuka
|| naakaemi ||
tappipOyina nan^ - daariMbeTTi - ika = tepparillachaesi naaku - teerchu nalasaTanu - naatappu manniMchun^ ganuka
|| naakaemi ||
neeti maargamun^ nilpunu nannu - ika = neetilaeninaaku tana su -neeti dayachaeyun^ sva-neetinin^ druMchun^
|| naakaemi ||
chaavucheekaTla - SaktiyuMDu -ika = lOyalObaDi pOvalasinananu - nae veravakuMDa - naa daevuDae tODu ganuka
|| naakaemi ||
kashTaMbulanu chee-kaTi lOyalO - ika = spashTamuga ghanasaukhyamunu naadRshTikiMjoopi - naa - nashTamul^ deerchun^ ganuka
|| naakaemi ||
meedapaDunaTTi - SOdhanalan^ - naa - naadariki raaneeka daMDamu - nannu laaguchunu - naa - kaadharaNayaunu ganuka
|| naakaemi ||
pagavaaral^ siggu-paDunaTlugaa - ika = jagati yerugani - saukhyabhOjana maguparachuchun^ - haa - taginadae peTTun^ ganuka
|| naakaemi ||
tanayaatmanaMda - tailaMbutO - nannu = anudinamu talayaMTi visuga-konaka tuDuchunu - naa - kanuneeLLanni ganuka
|| naakaemi ||
paluvidhamulaina - bhaagyamulatO - naaku = velupaliki diga - veDalu naTTi velagalaginne - naa kalimigaa jaeyun^ ganuka
|| naakaemi ||
bratukaMtaTan^ kR-paakshaemamulu - naa = vadalakuMDagavachchu naatO - sudinamulugalgu - naa - padalu saMpadalau ganuka
|| naakaemi ||
duritaMbuluMDu - dharaNi naaku - ika = iravukaadika - neppaTikinaa parama daevuni - maMdirame naayillu ganuka
|| naakaemi ||
reMDava bhaagamu
kaavalasinavella - kanabaDa galavu - manaku = aeviyaDigina - vaani nichchi vaeyunu taMDri - ichchi
|| naakaemi ||
dhanasahaayaMbu - manakugalugu naeDu anudinaMbu - taMDri manaku akkaralu teerchu - mana
|| naakaemi ||
basa yaerpaaTulu maa - prabhuvae chaeyun^ - naa = basa digina sthalamaMdu maa - prabhuve nivasiMchun^ - maa
|| naakaemi ||
prabhuvu dootalunu - pariSuddhulun^ - ika = vibhavamuga mana madhya - masaluchu velguchuMdurugaa - haa
|| naakaemi ||
janakuniyishTa - janamu vachchu ika tanaku yishTamugaani janamunu dariki raaneeyaDu - ee
|| naakaemi ||
maamitrulaina - mahima dootalae - ika = kshaemamunakai maachuTTu - chaerikaayuduru - chuTTu
|| naakaemi ||
aMdarumaeLLu - anubhaviMpa - ipuDu = viMdugaa samakooDu vaartalu vinipiMchunu - taMDri
|| naakaemi ||
prabhuni Sareera - raktamulu - naa = ubhaya jeevitamulaku - maelai uMDunu - naaku
|| naakaemi ||
naijapaapamulu - naSiyiMchuTakae - mana = bhOjanamu vaDDiMchunu - raajaesvayamugaa - daeva
|| naakaemi ||
nee manasulOnivi - neravaerunu - ika = kshaemamuganae uMDavalayu - chiMtalaekuMDa - neevu - chiMtalaekuMDa - ganuka
|| naakaemi ||
naaku naataMDri - nararoopamutO - ika = traikunireetiga kanabaDi dhairya michchunu - naaku - dhairyamichchunu - ganuka
|| naakaemi ||
janaka sutaatma - lanu daevuDu - ika = ghanamugaa yugamulananniTa vinutuloMdunu - naenaa - yana gorrenae ganuka
|| naakaemi ||
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment