Prabhuva nee kaluvari thyagamu chupene ప్రభువా నీ కలువరి త్యాగము చూపెనే

Song no: 148

    ప్రభువా నీ కలువరి త్యాగము
    చూపెనే నీ పరిపూర్ణతను
    నాలో సత్‌ క్రియలు ప్రారంభించిన అల్పా ఓమేగా నీవైతివే || ప్రభువా ||

  1. నీ రక్షణయే ప్రాకారములని
    ప్రఖ్యాతియే నాకు గుమ్మములని తెలిపి - 2
    లోకములోనుండి ననువేరు చేసినది
    నీదయా సంకల్పమే - 2 || ప్రభువా ||

  2. జీవపు వెలుగుగ నను మార్చుటకే
    పరిశుద్ధాత్మను నాకొసగితివే - 2
    శాశ్వత రాజ్యముకై నను నియమించినది
    నీ అనాది సంకల్పమే - 2 || ప్రభువా ||

  3. సంపూర్ణునిగా నను మార్చుటకే
    శ్రమలలో నీ కృప నిండుగ నిచ్చితివే - 2
    పరిపూర్ణ శాంతితో నను కాచుటయే
    నీ నిత్యసంకల్పమే - 2 || ప్రభువా ||
Share:

No comments:

Post a Comment

Popular Products

Labels

Blog Archive

Recent Posts

Unordered List

  • Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit.
  • Aliquam tincidunt mauris eu risus.
  • Vestibulum auctor dapibus neque.

Pages