Song no: 122
- నీవుగాక ఎవరున్నారు నాకు ఇలలో యేసయ్య } 2
- ఘోరపాపముతో నిండిన నా హృదిని
మార్చితివే నీదరి చేర్చితివే } 2
హత్తుకొని ఎత్తుకొని
తల్లివలె నన్ను ఆదరించితివే } 2 || నీవుగాక ||
- అడుగులు తడబడిన నా బ్రతుకుబాటలో
వెదకితివే నావైపు తిరిగితివే } 2
స్థిరపరచి బలపరచి
తండ్రివలె నాకు ధైర్యమిచ్చితివే } 2 || నీవుగాక ||
నీవే మార్గము సత్యము నీవే నిత్యజీవము నీవేగదయ్య } 2