Naa pranama nalo nevu yendhuku krungiyunnavu నా ప్రాణమా నాలో నీవు ఎందుకు కృంగియున్నావు

ly
0
Song no:
HD
    నా ప్రాణమా నాలో నీవు
    ఎందుకు కృంగియున్నావు
    యెహోవాయందే ఇంకను
    నిరీక్షణ ఉంచుము నీవు (2) || నా ప్రాణమా ||

  1. ఈతి బాధల్ కఠిన శ్రమలు
    అవమానములే కలిగిన వేళ (2)
    నీ కొరకే బలియైన యేసు
    సిలువను గూర్చి తలపోయుమా (2)
    అల్పకాల శ్రమల పిదప
    మహిమతో నిను నింపును ప్రభు నా ప్రాణమా (2) || నా ప్రాణమా ||

  2. ఆప్తులంతా నిను వీడిననూ
    శత్రువులే నీపై లేచిననూ (2)
    తల్లి అయినా మరచినా మరచున్
    నేను నిన్ను మరువాననినా (2)
    యేసుని ప్రేమన్ తలపోయుమా
    ఆశ్రయించు ప్రభుని నా ప్రాణమా (2) || నా ప్రాణమా ||

  3. ఐశ్వర్యమే లేకున్ననూ
    సౌఖ్య జీవితమే కరువైననూ (2)
    ప్రభు సేవలో ప్రాణములనే
    అర్పించవలసి వచ్చిననూ (2)
    క్రీస్తునికే అంకితమై ఆనందించు
    ప్రభు రాకకై కనిపెట్టుమా నా ప్రాణమా (2) || నా ప్రాణమా ||


    Naa Praanamaa Naalo Neevu
    Enduku Krungiyunnaavu
    Yehova Yande Inkanu
    Nireekshana Unchumu Neevu (2) ||Naa Praanamaa||

    Eethi Baadhal Katina Shramalu
    Avamaanamule Kaligina Vela (2)
    Nee Korake Baliyaina Yesu
    Siluvanu Goorchi Thalapoyumaa (2)
    Alpakaala Shramala Pidapa
    Mahimatho Ninu Nimpunu Prabhu Naa Praanamaa (2) ||Naa Praanamaa||

    Aapthulantha Ninu Veedinanoo
    Shathruvule Neepai Lechinanoo (2)
    Thalliainaa Marachina Marachun
    Nenu Ninnu Maruvaananinaa (2)
    Yesuni Preman Thalapoyumaa
    Aashrayinchu Prabhuni Naa Praanamaa (2) ||Naa Praanamaa||

    Aiashwaryame Lekunnanoo
    Soukhya Jeevithame Karuvainanoo (2)
    Prabhu Sevalo Praanamulane
    Arpinchavalasi Vachchinanoo (2)
    Kreesthunike Ankithamai Aanandinchu
    Prabhu Raakakai Kanipettumaa Naa Praanamaa (2) ||Naa Praanamaa||

Post a Comment

0Comments

Post a Comment (0)